లార్డ్స్‌లో గెలిచేది మేమే.. లంచ్‌ తర్వాత విజయ లాంఛనం: వాషీ

Published on Mon, 07/14/2025 - 16:11

లార్డ్స్‌ టెస్టులో గెలుపు తమదేనని టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అన్నాడు. ఐదో రోజు ఆటలో భోజన విరామ సమయం తర్వాత తాము గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇందులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ 387 పరుగులు చేయగా.. బదులుగా టీమిండియా కూడా తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా అంతే స్కోరు చేసింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 192 పరుగులకే పడగొట్టేశారు. ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జో రూట్‌ (40), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (33), జేమీ స్మిత్‌ (8)ల రూపంలో మూడు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు.. ఆఖర్లో షోయబ్‌ బషీర్‌ (2)ను పెవిలియన్‌కు పంపాడు.

మిగతా బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. నితీశ్‌ రెడ్డి, ఆకాశ్‌ దీప్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఈ క్రమంలో ఆదివారమే లక్ష్య ఛేదన (193)కు దిగిన గిల్‌ సేన.. ఆట పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఇక ఐదో రోజు ఆటలో టీమిండియా 135 పరుగులు చేస్తే లార్డ్స్‌లో విజయభేరి మోగించగలదు.

ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ సుందర్‌ మాట్లాడుతూ.. ‘‘మేము గెలవబోతున్నాము. మొదటి సెషన్‌లోనే ఈ పని పూర్తి కావచ్చు. బహుశా లంచ్‌ తర్వాత మా విజయం లాంఛనమే. ప్రస్తుతం మేము పటిష్ట స్థితిలోనే ఉన్నాము.

అయితే, ఆట ముగిసే సరికి కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఉంటే.. ఇంకాస్త ముందుగానే విజయం వరించేది. ఏదేమైనా ఆదివారం మేము అద్భుతంగా బౌలింగ్‌ చేశాము. ఒత్తిడి ఉన్నా ఎక్కడా తడబడలేదు’’ అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే..  58/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (9).. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కాసేపటికే కేఎల్‌ రాహుల్‌ (39) కూడా వెనుదిరిగాడు.స్టోక్స్‌ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 23.5 ఓవర్లలో 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 

అంతకుముందు.. యశస్వి జైస్వాల్‌ (0), కరుణ్‌ నాయర్‌ (14), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (6), ఆకాశ్‌ దీప్‌ (1) పూర్తిగా నిరాశపరిచారు. కాగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ గెలవగా.. రెండో టెస్టులో భారత్‌ విజయం సాధించి.. సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)