Breaking News

తెలుగు టైటాన్స్‌ గెలుపు జోరు..

Published on Mon, 10/06/2025 - 07:19

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ విజయపరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 40–35 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో టైటాన్స్‌ జట్టుకిది ఓవరాల్‌గా ఏడో విజయం కాగా... వరుసగా నాలుగో గెలుపు.

టైటాన్స్‌ తరఫున భరత్‌ హుడా 14 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెపె్టన్‌ విజయ్‌ మలిక్‌ తొమ్మిది పాయింట్లతో మెరిశాడు. డిఫెండర్‌ శుబ్‌మన్‌ షిండే ఐదు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధాస్‌ తరఫున భవానీ రాజ్‌పుత్‌ 16 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. 

ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌ ఏడింటిలో గెలిచి, ఐదింటిలో ఓడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 33–29తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌తో దబంగ్‌ ఢిల్లీ; యూపీ యోధాస్‌తో పట్నా పైరేట్స్‌ తలపడతాయి.
చదవండి: ICC Womens World Cup 2025: పాక్‌పై భారత్‌ గెలుపు.. మహిళలూ మురిపించారు

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)