Breaking News

టైటాన్స్‌ ఓటమితో మొదలు

Published on Sat, 08/30/2025 - 01:29

విశాఖ స్పోర్ట్స్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) కొత్త సీజన్‌ను కూడా తెలుగు టైటాన్స్‌ పరాజయంతో ప్రారంభించింది. గత సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన టీమ్‌ ఈసారి విశాఖపట్నం వేదికగా కూడా శుభారంభం చేయలేకపోయింది. శుక్రవారం ప్రారంభమైన పీకేఎల్‌ 12వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 38–35 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. టైటాన్స్‌ తరఫున ఆల్‌రౌండర్‌ భరత్‌ 11 పాయింట్లు సాధించగా, కెప్టెన్    విజయ్‌ మలిక్‌ 6 పాయింట్లు నమోదు చేశాడు. 

తలైవాస్‌ జట్టులో రైడర్‌ అర్జున్‌ దేశ్‌వాల్‌ 12 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా,  కెపె్టన్‌ పవన్‌ సెహ్రావత్‌ చెలరేగి 9 పాయింట్లతో జట్టును విజయం దిశగా నడిపించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి తలైవాస్‌ జట్టు 14–13తో ఆధిక్యంలో నిలవగా, రెండో అర్ధ భాగంలోనూ రెండు పాయింట్లు ముందంజలో నిలిచిన జట్టు చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. మొదటి రోజే జరిగిన రెండో మ్యాచ్‌లో ‘టైబ్రేక్‌’ ద్వారా ఫలితం వచ్చింది. బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్‌ మధ్య జరిగిన ఈ పోరు నిర్ణీత సమయంలో 32–32తో సమంగా ముగిసింది. 

బుల్స్‌ తరఫున ఆకాశ్‌ షిండే 12, ఆశిష్‌ మలిక్‌ 8 పాయింట్లు సాధించగా... పల్టన్‌ ఆటగాళ్లలో ఆదిత్య షిండే 9, పంకజ్‌ మోహితే 6 పాయింట్లు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత పుణేరీ ‘టైబ్రేక్‌’లో విజయం సాధించింది. ఐదు రైడ్‌ల ఈ టైబ్రేక్‌ను పల్టన్‌ 6–4తో గెలుచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 8 గంటల నుంచి), గుజరాత్‌ జెయింట్స్‌తో యు ముంబా  (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)