Breaking News

తెలుగు టైటాన్స్‌కు చావో రేవో మ్యాచ్‌.. ఓడితే ప‌రిస్థితి ఏంటి?

Published on Tue, 10/28/2025 - 15:21

ప్రోకబ‌డ్డీ లీగ్‌-2025లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న‌ తెలుగు టైటాన్స్ కీల‌క పోరుకు సిద్ద‌మైంది. మంగళ‌వారం(అక్టోబ‌ర్ 28) ఢిల్లీ వేదిక‌గా ఎలిమినేటర్‌-3లో పాట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ త‌ల‌పడ‌నుంది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌ విజ‌యం సాధిస్తే బుధ‌వారం జ‌రిగే క్వాలిఫ‌య‌ర్‌-2లో పుణేరి ప‌ల్టాన్‌ను ఢీకొట్ట‌నుంది.

ఒక‌వేళ ఈ చావో రేవో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓట‌మి పాలైతే టోర్నీ నుంచి నిష్క్ర‌మించనుంది. కావరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్‌కు పాట్నాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పైరేట్స్ జ‌ట్టులో అయాన్ లోచాబ్, మణీందర్ సింగ్ వంటి అద్బుత‌మైన రైడ‌ర్లు ఉన్నారు. వీరిద్ద‌రూ చెల‌రేగితే టైటాన్స్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు. 

ప్రస్తుత సీజన్‌లో అత్యధిక రైడ్‌ పాయింట్ల సాధించిన జాబితాలో అయాన్‌ (294) అగ్రస్దానంలో ఉన్నాడు. అదేవిధంగా పాట్నా డిఫెండర్‌ నవదీప్‌ నుంచి కూడా టైటాన్స్‌ రైడర్స్‌కు కష్టాలు ఎదురుకానున్నాయి.  నవదీప్‌ 68 టాకిల్‌ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నారు. వీరిముగ్గురి జోరుకు కళ్లెం వేస్తే తెలుగు టైటాన్స్‌ విజయం నల్లేరు మీద నడక కానుంది. 

అయితే పీకేఎల్-12 వ సీజన్‌లో పాట్నా కంటే టైటాన్స్‌కే మెరుగైన రికార్డు ఉంది. తెలుగు టైటాన్స్ ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడి పదింట విజయం సాధించగా.. పాట్నా 18 మ్యాచ్‌లు ఆడి కేవలం ఎనిమిదింట మాత్రమే విజయం సాధించింది. కానీ ఆరంభంలో తడబడిన పాట్నా.. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లే ఇన్స్‌కు ఆర్హత సాధించడం గమనార్హం.

కాగా తెలుగు టైటాన్స్‌కు  కెప్టెన్ విజయ్ మాలిక్‌,  భరత్ హుడా అద్బుతమైన ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. సోమవారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మినీ క్వాలిఫయర్‌లో కూడా వీరిద్దరూ సత్తాచాటారు. 
తెలుగు టైటాన్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7
తెలుగు టైటాన్స్: చేతన్ సాహు, సాగర్, అజిత్ పవార్, విజయ్ మాలిక్ (కెప్టెన్‌), భరత్ హుడా, శుభమ్ షిండే, అంకిత్.

పాట్నా పైరేట్స్: అంకిత్ కుమార్, దీపక్, బాలాజీ డి, అయాన్ లోహ్చాబ్, మిలన్ దహియా, నవదీప్ అంకిత్ జగ్లాన్ (కెప్టెన్‌).
చదవండి: దబంగ్‌ ఢిల్లీ ఫైనల్‌కు 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు