Breaking News

ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగిన ప్రియాన్షు.. 79 ఏళ్ల రికార్డు బద్దలు

Published on Tue, 10/27/2026 - 18:35

రంజీ ట్రోఫీ 2026-27లో బరోడా యువ బ్యాటర్ ప్రియాన్షు మోలియా (21) చరిత్ర సృష్టించాడు. జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయమైన ట్రిపుల్‌ సెంచరీ (321) చేయడంతో బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 79 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 1947లో గుల్ మహమ్మద్ చేసిన 319 పరుగుల నేటి వరకు బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. ఈ రికార్డును ప్రియాన్షు ఇవాళ అధిగమించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. బరోడా తొలుత బ్యాటింగ్‌ చేయగా.. ప్రియాంన్షు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 492 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మహేశ్ పిథియాతో కలిసి ఏడో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పిథియా తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ (102) సాధించాడు. ప్రియాంన్షు, పిథియా సత్తా చాటడంతో బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 616 పరుగులకు ఆలౌటైంది.

21 ఏళ్ల 132 రోజుల వయసులో ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రియాన్షు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏడో అతి పిన్న భారత బ్యాటర్‌గా నిలిచాడు. అతి పిన్న వయసులో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా వసీం​ జాఫర్‌ (18 ఏళ్ల 262 రోజులు) చలామణి అవుతున్నాడు.

బరోడా ఇన్నింగ్స్‌ పూర్తైన అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జమ్మూ కశ్మీర్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కమ్రాన్‌ ఇక్బాల్‌ (0), షుభమ్‌ ఖజూరియా (2) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌ బరోడా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది. 

ఇదీ చదవండి: రంజీ ట్రోఫీ.. డబుల్‌ సెంచరీలతో మోతెక్కించిన బ్యాటర్లు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)