Breaking News

ప్రియాన్ష్‌.. నీ కోసం ఐపీఎల్ ఎదురుచూస్తోంది

Published on Tue, 09/03/2024 - 13:54

ప్రియాంష్ ఆర్య.. ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఒక యువ సంచ‌ల‌నం. ఈ లీగ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రియాన్ష్‌ ఆర్య త‌న అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌లతో అంద‌ర‌ని ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా గ‌త వారంలో . నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన ఈ యువ సంచ‌ల‌నం.. ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అత‌డి హిట్టింగ్ స్కిల్స్ గురించి ఎంతచెప్పుకున్న త‌క్కువే.

ఈ ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు త‌న సిక్స‌ర్ల‌తో భార‌త దిగ్గ‌జం యువ‌రాజ్ సింగ్‌ను గుర్తు చేస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన ప్రియాన్ష్‌.. 576 ప‌రుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ లీగ్‌లో దుమ్ములేపుతున్న ఆర్య త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు.

ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఆడాల‌న్న త‌న కోరిక‌ను 23 ఏళ్ల ఆర్య వ్య‌క్తం చేశాడు. అందుకు గ‌ల కారణాన్ని కూడా ఆర్య వెల్ల‌డించాడు. కోహ్లి తనకు రోల్‌మోడ‌ల్ అని, అత‌డితో క‌లిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవాల‌న‌కుంటున్నాని ప్రియాన్ష్‌ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ ఎదురుచూస్తోంది..
ఇక ఈ ఏడాది ఆఖ‌రిలో ఐపీఎల్‌-2025 మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఈ వేలంలో ప్రియాంష్ ఆర్య‌పై కాసుల వ‌ర్షం కురిసే అవ‌కాశ‌ముంది. ఇటువంటి యువ సంచ‌ల‌నాల కోస‌మే ఫ్రాంఛైజీలు వేయిక‌ళ్లుతో ఎదురుచూస్తున్నాయి. ఇప్ప‌టికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆర్య‌పై ఓ క‌న్నేసి ఉంటాయి.

నా దృష్టి అంతా ఆ టోర్నీపైనే..
ఐపీఎల్‌ గురించి ప్రస్తుతం నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ టోర్నీ. ఈ లీగ్ కోసం ఆలోచించడం, ఒత్తడిని ఎదుర్కొవడం రెండూ ఒకటే. వేలం కూడా నా ఆలోచన లేదు. ఆడే అవకాశం వస్తే అది నా శ్రమకు దక్కిన ఫలితంగా భావిస్తాను. 

అయితే నా దృష్టింతా ప్రస్తుతం  సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీపైనే ఉంది.  నా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి ఇది గొప్ప అవకాశం. అక్కడ అద్భుతప్రదర్శన జట్టును గెలిపించడమే నా లక్ష్యమని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్య పేర్కొన్నాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)