Breaking News

రూ.30 లక్షల ధరతో ఎంట్రీ.. కట్‌ చేస్తే కోట్ల వర్షం! ఎవరీ ప్రియాన్ష్‌?

Published on Mon, 11/25/2024 - 20:25

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ఢిల్లీ యువ సంచలనం ప్రియాన్ష్‌ ఆర్యపై కాసుల వర్షం కురిసింది.  ప్రియాన్ష్‌ ఆర్యను  రూ. 3.80 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కైవసం చేసుకుంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆర్య కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. 

ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. కాసేపు పంజాబ్‌, ఢిల్లీ మధ్య పోటీ నెలకొంది. అనంతరం ఢిల్లీ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రియాన్ష్‌య పంజాబ్ సొంతమయ్యాడు.

ఎవరీ ప్రియాన్ష్‌ ఆర్య..?
23 ఏళ్ల ప్రియాన్ష్‌ ఆర్య లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఢిల్లీ త‌ర‌పున ఆడుతున్నాడు. ప్రియాన్స్‌ ఆర్యా 2019లో భార‌త్‌ అండర్‌-19 జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఇప్పుడు భారత సీనియర్‌ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌తో కలిసి అత‌డు ఆడాడు.

అయితే ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వ‌చ్చాడు. ఈ ఏడాది డీపీఎల్‌లో సౌత్‌ ఢిల్లీ సూపర్‌ స్టార్స్ త‌ర‌పున  ఆర్య‌ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న కన‌బరిచాడు.

ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్‌రేటుతో 608 ప‌రుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెట‌ర్‌కు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడి 356 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)