Breaking News

రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్‌..

Published on Mon, 05/26/2025 - 19:18

ఇండియా-ఎ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, గుజ‌రాత్ స్టార్ బ్యాట‌ర్ ప్రియాంక్ పంచ‌ల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అన్ని ర‌కాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన త‌న దేశవాళీ కెరీర్‌కు ముగింపు ప‌లికాడు.

ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నాకు ఈ క్ష‌ణం చాలా భాగోద్వేగంతో కూడుకున్న‌ది. అంతే గ‌ర్వంగా కూడా ఉంది. నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన గుజ‌రాత్ క్రికెట్ ఆసోషియేష‌న్‌కు, అభిమానుల‌కు, స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు ధ‌న్య‌వాదాలు అని త‌న రిటైర్మెంట్ నోట్‌లో పంచ‌ల్ పేర్కొన్నాడు.

ప్రియాంక్‌కు దేశ‌వాళీ క్రికెట్‌లో అద్బుత‌మైన రికార్డులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌, లిస్ట్-ఎ క్రికెట్‌లో ప‌రుగులు వ‌ర‌ద పారించాడు. ప్రియాంక్  తన 17 ఏళ్ల కెరీర్‌లో127 ఫస్ట్-క్లాస్ మ్యా‌చ్‌లు ఆడి 8856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

ముఖ్యంగా 2016-17 రంజీ సీజ‌న్‌లో ఈ గుజరాతీ బ్యాటర్‌​ భీబత్సం సృష్టించాడు. ఆ సీజన్‌లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఆ ఎడిషన్‌లో 1310 పరుగులు చేశాడు.  అదేవిధంగా97 లిస్ట్ ఏ మ్యాచుల్లో 8 సెంచ‌రీల‌తో క‌లిపి 3,672 పరుగులు  చేశాడు.  59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 స‌గ‌టుతో 1,522 ప‌రుగులు సాధించాడు.

కాగా ప్రియాంక్ 2021లో టీమిండియాకు రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. కానీ భారత తరుపన అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. 2022 శ్రీలంక టూర్‌కు కూడా సెలక్ట్ అయ్యాడు. అక్కడ కూడా అతడికి డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?