Breaking News

‘పర్ఫెక్ట్‌ ఇన్నింగ్స్‌.. నిశ్చితార్థం చేసుకున్నా’

Published on Sun, 03/08/2026 - 16:21

భారత స్టార్‌ క్రికెటర్‌ పృథ్వీ షా శుభవార్త చెప్పాడు. మనసిచ్చిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆదివారం వెల్లడించాడు. ఆకృతి అగర్వాల్‌తో తన ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు.

ఈ సందర్భంగా.. ‘‘మైదానంలో సిక్సర్లు బాదడం నుంచి.. జీవితకాలం మైదానం వెలుపలా అదే జోరు కొనసాగించేలా.. ఆమే నా పర్ఫెక్ట్‌ ఇన్నింగ్స్‌.. జస్ట్‌ ఇప్పుడే నిశ్చితార్థం చేసుకున్నా’’ అని 26 ఏళ్ల పృథ్వీ షా ఇన్‌స్టా వేదికగా తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు షేర్‌ చేశాడు. దీంతో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఆకృతి ఎవరంటే?
సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌, నటిగా 22 ఏళ్ల ఆకృతి అగర్వాల్‌ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆకృతి.. ఉన్నత విద్య కోసం ముంబైకి వచ్చింది.

ఈ క్రమంలో నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. త్రిముఖ అనే చిత్రంలో మొదటిసారి నటించింది. ఇక పృథ్వీ షాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. గతేడాది రొమాంటిక్‌ రీల్‌ చేయడం ద్వారా తమ బంధం గురించి వీరు అభిమానులకు సంకేతాలు ఇచ్చారు.

ఇటీవల.. సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌- సానియా చందోక్‌ల వివాహానికి కూడా పృథ్వీ- ఆకృతి జంటగా హాజరయ్యారు. ఇంతలోనే.. వారం తిరగకముందే ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 

పడిలేచిన ప్రయాణం
చిన్న వయసులోనే క్రికెటర్‌గా సత్తా చాటిన పృథ్వీ షా.. కెప్టెన్‌గా భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించాడు. ఈ క్రమంలో టీమిండియాలో అరంగేట్రం చేసిన ఈ ముంబైకర్‌.. ఓపెనర్‌గా ఆరంభంలో సత్తా చాటాడు.

అయితే, ఆ తర్వాత ఫామ్‌ కొనసాగించలేక జట్టులో స్థానం కోల్పోయాడు. పృథ్వీ షా కెప్టెన్సీలో అండర్‌ 19 వరల్డ్‌కప్‌ ఆడిన శుబ్‌మన్‌ గిల్‌ ఇపుడు టీమిండియా కెప్టెన్‌ స్థాయికి ఎదగగా.. క్రమశిక్షణా రాహిత్యంతో పృథ్వీ షా అధఃపాతాళానికి పడిపోయాడు. ఇటీవలే మళ్లి ఫామ్‌ అందుకున్న అతడు.. ముంబై తరఫున దేశీ ‍క్రికెట్లో రాణించాడు. ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది మినీ వేలంలో రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని కొనుగోలు చేసింది.

చదవండి: ఘనంగా అర్జున్‌ టెండుల్కర్‌- సానియా వివాహం.. వీడియో వైరల్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)