Breaking News

కెప్టెన్‌గా రుతురాజ్‌పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు

Published on Thu, 08/14/2025 - 19:04

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మహారాష్ట్ర తరపున అరంగేట్రం చేసేందుకు టీమిండియా ఆట‌గాడు, ముంబై మాజీ ఓపెన‌ర్ పృథ్వీ షా సిద్దమవుతున్నాడు. బుచ్చి బాబు మల్టీ-డే టోర్నమెంట్ 2025 కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

ఈ జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కింది. 25 ఏళ్ల పృథ్వీ షా ఇటీవలే ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో తెగదింపులు చేసుకుని మహారాష్ట్రకు తన మకాంను మార్చాడు. ఇక  బుచ్చి బాబు టోర్నీ కోసం మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా అంకిత్ బావ్నేను సెల‌క్ట‌ర్లు నియ‌మించారు. 

మహారాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను కాద‌ని బావ్నేకు సెల‌క్ట‌ర్లు అవ‌కాశ‌మిచ్చారు. గ‌త రంజీ సీజ‌న్‌లో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గైర్హ‌జ‌రీలో బావ్నేనే జ‌ట్టుకు  నాయకత్వం వహించాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహారాష్ట్ర తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్లలో రెండో ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అయితే సెల‌క్ట‌ర్లు గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయ‌క‌పోవ‌డం వెన‌క ఓ కార‌ణ‌ముంది. 

ఈ భార‌త ఓపెన‌ర్ 2025-26 దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టుకు సెల‌క్ట్ చేశారు. ఆగస్టు 28న దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుందున, బుచ్చిబాబు టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు రుతు అందుబాటులో ఉండ‌డు. అందుకే బావ్నే కెప్టెన్‌గా నియ‌మించారు.

ఈ ఏడాది బుచ్చిబాబు టోర్నీ ఆగ‌స్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మ‌హారాష్ట్ర జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 18 నుండి 20 వరకు గురునానక్ కళాశాల మైదానంలో  ఛత్తీస్‌గఢ్‌తో తలపడ‌నుంది.

మహారాష్ట్ర జట్టు
అంకిత్ బావ్నే (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సిద్ధేష్ వీర్, సచిన్ దాస్, అర్షిన్ కులకర్ణి, హర్షల్ కేట్, సిద్ధార్థ్ మ్హత్రే, సౌరభ్ నవాలే (వికెట్ కీప‌ర్‌), మందార్ భండారి, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దాధే, ప్రదీప్ దద్దే, ప్రదీప్ దద్దే సోలంకి, రాజవర్ధన్ హంగర్గేకర్

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?