Breaking News

Prithvi Shaw: తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలం

Published on Wed, 08/20/2025 - 20:41

బుచ్చిబాబు క్రికెట్‌ టోర్నీ 2025లో సంచలనం నమోదైంది. పృథ్వీ షా, రుతురాజ్‌ గైక్వాడ్‌ లాంటి స్టార్లు ఉన్న మహారాష్ట్రను చిన్న జట్టు ఛత్తీస్‌ఘడ్‌ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛత్తీస్‌ఘడ్‌ సంజీత్‌ దేశాయ్‌ (93) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. శుభమ్‌ అగర్వాల్‌, అవ్నీశ్‌ సింగ్‌ ధలీవాల్‌ ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో విక్కీ ఓస్త్వాల్‌, హితేశ్‌ వలుంజ్‌ తలో 3 వికెట్లు తీశారు.

అరంగేట్రంలోనే మెరుపు సెంచరీ చేసిన పృథ్వీ షా
అనంతరం బరిలోకి దిగిన మహారాష్ట్ర.. అరంగేట్రం ఆటగాడు పృథ్వీ షా మెరుపు సెంచరీతో (111) ఆదుకోవడంతో 217 పరుగులు చేయగలిగింది. షా రాణించినా మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ఛత్తీస్‌ఘడ్‌కు 35 పరుగులు కీలక ఆధిక్యం లభించింది. దేశవాలీ క్రికెట్‌లో ముంబై తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో షా మహారాష్ట్రకు మారిన విషయం తెలిసిందే.

చెలరేగిన మహా బౌలర్లు
35 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఛత్తీస్‌ఘడ్‌.. మహారాష్ట్ర బౌలర్లు  విక్కీ ఓస్త్వాల్‌, హితేశ్‌ వలుంజ్‌ (థలో 5 వికెట్లు తీశారు) ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది.

ఘోరంగా విఫలమైన షా, రుతురాజ్‌
అనంతరం 185 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన మహారాష్ట్ర అనూహ్యంగా 149 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పృథ్వీ షా రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. మరో స్టార్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. 

బావ్నే ఒంటరిపోరాటం వృధా
కెప్టెన్‌ అంకిత్‌ బావ్నే ఒంటరిపోరాటం (66) చేసినా మహారాష్ట్రను గెలిపించలేకపోయాడు. 36 పరుగుల తేడాతో ఛత్తీస్‌ఘడ్‌ మహారాష్ట్రను ఓడించింది. శుభమ్‌ అగ్రవాల్‌ మహారాష్ట్రను దెబ్బేశాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)