Breaking News

'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్‌కు సారీ చెప్పిన పృథ్వీ షా

Published on Fri, 10/10/2025 - 15:07

ముంబై, మహారాష్ట్ర రంజీ ట్రోఫీ వార్మాప్ మ్యాచ్‌లో ముషీర్ ఖాన్‌-పృథ్వీ షా(Prithvi Shaw) మధ్య చోటు చేసుకున్న వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. ముషీర్‌కు పృథ్వీ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. "పృథ్వీ షా తన తప్పును తెలుసుకుని ముషీర్‌కు  క్షమాపణలు చెప్పాడు. 

పృథ్వీ అతడితోతో నేను నీకు అన్నయ్య లాంటివాడిని అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవు. అంతా బాగానే ఉంది" మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్ వర్గాలు వెల్లడించాయి.

అసలేమి జరిగిందంటే?
రంజీ ట్రోఫీ 2025-26 సీజ‌న్‌కు ముందు ముంబై, మ‌హారాష్ట్ర జ‌ట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి.  ఈ మ్యాచ్‌లో మ‌హారాష్ట్ర త‌ర‌పున ఆడిన పృథ్వీ షా(181) భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు. తొలి రోజు ఆట ముగిస్తుందన్న సమయంలో పృథ్వీ.. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు.

ముషీర్ వికెట్ తీసిన తర్వాత "థాంక్యూ" అని కాస్త వ్యంగ్యంగా అన్నాడు.  దీంతో పృథ్వీ షా కోపంతో ఊగిపోయాడు. ముషీర్‌ను బ్యాట్‌తో కొట్టేందుకు అతడు వెళ్లాడు. అంపైర్‌లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

అయితే ఈ వ్యవహరంపై ముంబై క్రికెట్ అసోయేషిన్‌, మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్(MCA) సీరియస్ అయ్యాయి. ఈ రెండు క్రికెట్ అసోయేషిన్‌లు విచారణకు ఆదేశించాయి. అంతలోనే ముషీర్‌కు పృథ్వీ సారీ వివాదాన్ని ముగించాడు. అయినప్పటికి తమ క్రమశిక్షణ నియమావళిని ఉల్లఘించినందుకు  మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్ ఏదైనా చర్య తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌తో విబేధాల కార‌ణంగా పృథ్వీ షా తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. రాబోయో రంజీ సీజ‌న్ కోసం మహారాష్ట్ర జ‌ట్టులో పృథ్వీకి చోటు దక్కింది.
చదవండి: దిగ్గజాల సరసన యశస్వి జైస్వాల్‌.. భారత రెండో బ్యాటర్‌గా..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)