Breaking News

ముంబై x బెంగళూరు

Published on Sun, 10/26/2025 - 04:24

సాక్షి, హైదరాబాద్‌: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) టోర్నీ తుది పోరుకు చేరింది. నాలుగో సీజన్‌ విజేత ఎవరో నేడు తేలనుంది. ముంబై మిటియోస్, బెంగళూరు టార్పెడోస్‌ల మధ్య ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో టైటిల్‌ పోరు జరుగనుంది. ఈ లీగ్‌ ఆరంభం నుంచి ఇరు జట్లు కూడా నిలకడైన ప్రదర్శనతో అదరగొట్టాయి. లీగ్‌ దశలో ముంబై ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. 

టార్పెడోస్‌ ఒక్క మ్యాచ్‌ తక్కువగా గెలిచిందంతే! ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదింట విజయం సాధించింది. ఇప్పుడు ఈ టాప్‌–2 జట్లే అమీతుమీకి సిద్ధమవడంతో నేటి ఫైనల్‌ తుదికంటా ఆసక్తి రేపడం ఖాయం. బెంగళూరుకిది రెండో ఫైనల్‌. 2023లో తుది పోరుకు చేరినప్పటికీ... అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. రెండేళ్ల క్రితం చేజారిన టైటిల్‌ను ఈసారి కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో బెంగళూరు ఆటగాళ్లున్నారు. 

లీగ్‌ టాపర్‌ ముంబై మిటియోస్‌కిది తొలి ఫైనల్‌ కాగా... ఆఖరి పోరులోనూ గెలిచి విజయవంతంగా సీజన్‌ను ముగించాలని ఆశిస్తోంది. మిటియోస్‌ కెప్టెన్‌ అమిత్‌ గులియా ఎప్పటిలాగే సమష్టి ప్రదర్శనపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆరంభం నుంచే మ్యాచ్‌లో  పట్టు బిగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతామని చెప్పాడు. మరోవైపు బెంగళూరు సారథి మ్యాట్‌ వెస్ట్‌ మాట్లాడుతూ ముంబైలాంటి గట్టి జట్టును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. తమ ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటమే తమకు కలిసొచ్చే అంశమని చెప్పాడు. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)