Breaking News

జింబాబ్వేతో నాలుగో టీ20.. ధోని శిష్యుడి ఎంట్రీ!

Published on Sat, 07/13/2024 - 12:36

జింబాబ్వేతో టీ20 సిరీస్‌పై టీమిండియా క‌న్నేసింది. శ‌నివారం హ‌రారే వేదిక‌గా  జ‌ర‌గ‌నున్న నాలుగో టీ20లో  జింబాబ్వేతో  భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే 2-1 ఆధిక్యంలో ఉన్న భార‌త్‌.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భావిస్తోంది.

తొలి టీ20లో అనూహ్య ఓట‌మి చ‌విచూసిన గిల్ బ్రిగేడ్‌.. త‌ర్వాత రెండు టీ20ల్లో మాత్రం ప్ర‌త్య‌ర్ధిని చిత్తు చేసింది. అదే జోరును నాలుగో టీ20లో కొన‌సాగించాల‌ని యంగ్ టీమిండియా భావిస్తోంది.

ధోని శిష్యుడి ఎంట్రీ?
అయితే ఈ మ్యాచ్‌లో భార‌త తుది జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు పేస‌ర్లు ఖాలీల్ అహ్మ‌ద్‌, అవేష్ ఖాన్‌ల‌కు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.  ఖాలీల్ స్ధానంలో ముంబై స్టార్ బౌల‌ర్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ పేస‌ర్ తుషార్ దేశ్‌పాండే అంత‌ర్జాతీయ అరగేట్రం చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ధోని శిష్యుడిగా పేరొందిన దేశ్‌పాండేకు టీ20ల్లో అద్బుత‌మైన రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు, ఐపీఎల్‌లో సీఎస్‌కేకు గ‌త రెండు సీజ‌న్ల‌లో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌-2024లో 17 వికెట్లు ప‌డ‌గొట్టిన తుషార్‌.. స‌య్య‌ద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో 16 వికెట్లు సాధించాడు. 

ఈ క్ర‌మంలోనే అత‌డికి చోటు ఇవ్వాల‌ని మెనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు వినికిడి. అదేవిధంగా అవేష్ ఖాన్ స్ధానంలో పేస‌ర్ ముఖేష్ కుమార్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

జింబాబ్వేతో నాలుగో టీ20కు భారత తుది జట్టు(అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్‌.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)