Breaking News

ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ..

Published on Thu, 11/13/2025 - 16:28

ఏసీసీ మెన్స్ ఆసియా కప్  రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్‌కు సమయం అసన్నమైంది. దోహా వేదికగా ఈ మెగా ఈవెంట్ శుక్రవారం(నవంబర్ 14) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌-ఎ, ఒమన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

ఆ తర్వాత అదే రోజున వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ వేదికగా భారత్‌-ఎ జట్టు, యూఏఈ జట్లు తలపడనున్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ కుమార్ సారథ్యంలో ఇండియా-ఎ జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.

ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi), ప్రియాన్ష్ ఆర్య, ఆశుతోష్ శర్మ వంటి ఐపీఎల్ సంచలనాలు ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో యువ ఆటగాళ్లతో కూడిన  భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. గ్రూపు-బిలో భారత్‌తో పాటు పాకిస్తాన్‌, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో యూఏఈతో మ్యాచ్‌లో భారత్ ఆడే ప్లేయింగ్ ఎలెవన్‌ను క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఓపెనర్లగా వైభవ్‌, ఆర్య..
ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ను యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఓపెనర్లగా తమ సత్తాను నిరూపించుకున్నారు. ఫస్ట్ డౌన్‌లో నమన్ ధీర్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. 

గత ఐపీఎల్ సీజన్‌లో నమన్ ముంబై ఇండియన్స్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచారు. మిడిలార్డర్‌లో నేహాల్ వధేరా, కెప్టెన్ జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఫినిషర్‌గా ఆశుతోశ్ శర్మకు తుది జట్టులో దక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆల్‌రౌండర్ల కోటాలో రమణ్‌దీప్ సింగ్‌, హర్ష్ దూబేలకు మెనెజ్‌మెంట్ అవ​​కాశమివ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్‌ యష్‌ ఠాకూర్‌, గుర్జాప్‌నీత్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్ వంటి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

భారత-ఎ తుది జట్టు
ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నమన్ ధీర్, జితేష్ శర్మ(కెప్టెన్‌), అశుతోష్ శర్మ, రమణదీప్ సింగ్, హర్ష్‌ దూబే, యష్ ఠాకూర్,గుర్జప్నీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్
చదవండి: IPL 2026: కేకేఆర్‌ జట్టులోకి షేన్ వాట్స‌న్‌..
 

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)