Breaking News

ప్రతీకకు టెస్టు పిలుపు

Published on Sun, 01/25/2026 - 11:12

న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలైన ప్రతీక రావల్‌... తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకుంది. ప్రతీకతో పాటు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వైష్ణవి శర్మ, మీడియం పేసర్‌ క్రాంతి గౌడ్‌ కూడా మొదటిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. మార్చి 6 నుంచి పెర్త్‌ వేదికగా ఆ్రస్టేలియాతో జరగనున్న ఏకైక టెస్టు కోసం సెలెక్షన్‌ కమిటీ శనివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. 

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు ఈ పర్యటనలో భాగంగా ఆసీస్‌తో 3 టి20లు, 3 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. పరిమిత ఓవర్ల కోసం ఇప్పటికే జట్లను ప్రకటించగా... తాజాగా టెస్టు జట్టును ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు ముందు గాయంతో జట్టుకు దూరమైన ప్రతీక ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకుంది. ఇక అండర్‌–19 ప్రపంచకప్‌ మెరుపులతో భారత టి20 జట్టులోకి వచి్చన వైష్ణవి ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో చోటు దక్కించుకుంది. ఇక వన్డే, టి20 సిరీస్‌లకు ఎంపికైన వికెట్‌ కీపర్‌ కమలిని గాయపడటంతో ఆమె స్థానంలో ఉమఛెత్రీకి అవకాశం దక్కింది. 

భారత మహిళల టెస్టు జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెపె్టన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జ్యోత్‌ కౌర్, రిచా ఘోష్, ఉమా ఛెత్రీ, ప్రతీక రావల్, హర్లీన్‌ డియోల్, దీప్తి శర్మ, రేణుక ఠాకూర్, స్నేహ్‌ రాణా, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, సయాలి సత్‌గరే.  

ఆ్రస్టేలియాతో ఏకైక టెస్టుకు భారత మహిళల జట్టు ప్రకటన  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)