Breaking News

వరల్డ్‌ నంబర్‌వన్‌ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద!

Published on Wed, 06/03/2026 - 15:12

భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్‌.ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీ 2026లో మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ చెస్‌లో వరుసగా రెండోసారి ఓడించి చావుదెబ్బ కొట్టాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రజ్ఞానందకు కార్ల్‌సన్‌పై తాజా విజయం ఆ ప్రయత్నాలకు ఊతమిచ్చినట్లయింది. 

అంతేకాదు నార్వే చెస్ టోర్నీలో కార్ల్‌సన్‌ను అతడి సొంతగడ్డపైనే రెండుసార్లు మట్టికరిపించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది క్లాసికల్ చెస్ గేమ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన తొలి ఆటగాడు కూడా ప్రజ్ఞానందనే కావడం విశేషం. మంగళవారం రాత్రి జరిగిన ఎనిమిదో రౌండ్‌లో ప్రజ్ఞానంద నల్లపావులతో బరిలోకి దిగాడు. 

కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఎనిమిదోసారి నార్వే చెస్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనుకున్న కార్ల్‌సన్ ఆశలకు ప్రజ్ఞానంద గండికొట్టినట్లయింది. ఇ‍ప్పటికే 8 రౌండ్లు పూర్తి కావడం, మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలిఉండడంతో కార్ల్‌సన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కష్టమే. 

గేమ్‌లో ప్రజ్ఞానంద విజయం ఖాయమైన తర్వాత కార్ల్‌సన్ మొహం మాడిపోయింది. ఓటమి బాధలో కనీసం ప్రజ్ఞానందకు అభినందనలు కూడా తెలియజేయకుండా అక్కడి నుంచి నిరాశతో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

స్టాండింగ్స్ విషయానికొస్తే.. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో తన రన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కైమర్‌ను టై-బ్రేక్‌లో ఓడించి 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరౌజా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

ఇక మరో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఓటమితో 8 పాయింట్లు మాత్రమే కలిగిన అతడు క్లాసికల్ చెస్ టోర్నీ టైటిల్ సాధించే అవకాశం కోల్పోయాడు. మిగిలిన రెండు గేములు గెలిచినా గుకేశ్ 14 పాయింట్ల వద్దే ఆగిపోనున్నాడు.

చదవండి: ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడ‌ర్స్‌తో క్రికెట‌ర్ల బంధం!

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)