Breaking News

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో విండీస్‌ వీరుడి విధ్వంసం

Published on Mon, 12/08/2025 - 14:45

దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2025లో విండీస్‌ వీరుడి రోవ్‌మన్‌ పావెల్‌ (Rovman Powell) విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌కు ఆడుతున్న పావెల్‌.. నిన్న (డిసెంబర్‌ 7) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 96 పరుగులు చేశాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని సెంచరీ కూడా పూర్తైయ్యేది. పావెల్‌ మెరుపులకు జోర్డన్‌ కాక్స్‌ (36 బంతుల్లో 52; ఫోర్లు, సిక్స్‌) మెరుపు హాఫ్‌ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో పావెల్‌, కాక్స్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.టాబీ ఆల్బర్ట్‌, సెదిఖుల్లా అటల్‌ తలో 8, షయాన్‌ జహంగీర్‌ 14 పరుగులకు ఔటయ్యారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ 2, అజయ్‌ కుమార్‌, పియూశ్‌ చావ్లా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలోనూ నైట్‌రైడర్స్‌ తడబడింది. వకార్‌ సలామ్‌ఖీల్‌ (3.3-0-29-4), మహ్మద్‌ నబీ (4-0-12-2), డేవిడ్‌ విల్లే (3-0-13-2), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (3-0-22-2) ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో ఫిల్‌ సాల్ట్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. విధ్వంసకర వీరులు లివింగ్‌స్టోన్‌ (16), రూథర్‌ఫోర్డ్‌ (19), రసెల్‌ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)