Breaking News

సూర్య భాయ్‌ వచ్చేస్తున్నాడు..!

Published on Mon, 08/04/2025 - 15:23

ఆసియా కప్‌-2025కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఖండాంతర​ టోర్నీకి సిద్దమయ్యాడు. స్కై కొద్ది రోజుల కిందట మ్యూనిచ్‌లో స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ విజయవంతం కావడంతో అతను ఎన్‌సీఏలో రిపోర్ట్‌ చేశాడు. ఆసియా కప్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు ఎన్‌సీఏలో తగు చర్యలు చేపట్డాడు.

ఎన్‌సీఏలో రిపోర్ట్‌ చేయడం వల్ల స్కైను దులీప్‌ ట్రోఫీ కోసం పరిగణలోకి తీసుకోలేదు. వెస్ట్‌ జోన్‌ సెలెక్టర్లు స్కై అందుబాటులో లేకపోవడంతో శార్దూల్‌ ఠాకూర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ జట్టులో ముంబై స్టార్లు, టీమిండియా ప్లేయర్లు యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, షమ్స్‌ ములానీ, తనుశ్‌ కోటియన్‌, తుషార్‌ దేశ్‌పాండే ఉన్నారు.

కాగా, ఆసియా కప్‌ పూర్తి షెడ్యూల్‌ ఇటీవలే విడుదలైంది. ఈ టోర్నీని సెప్టెంబర్‌ 9-28 మధ్య తేదీల్లో యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో సూర్యకుమార్‌ యాదవ్‌ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది. స్కై ఈ ఏడాది ఐపీఎల్‌లో చివరిసారి బ్యాట్‌ పట్టాడు. ఆతర్వాత అతను శస్త్ర చికిత్స నిమిత్తం మ్యూనిచ్‌కు వెళ్లాడు.

శ్రేయస్‌ కూడా..!
మరో టీమిండియా బ్యాటర్‌ కూడా ఇటీవలే ఎన్‌సీఏని సందర్శించాడు. రొటీన్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా శ్రేయస్‌ అయ్యర్‌ ఎన్‌సీఏకి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రేయస్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి దులీప్‌ ట్రోఫీకి అందుబాటులో ఉన్నాడు. దులీప్‌ ట్రోఫీ ఆగస్ట్‌ 28 నుంచి ప్రారంభం కానుంది. వెస్ట్‌ జోన్‌ సెప్టెంబర్‌ 4న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)