Breaking News

క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్‌

Published on Sat, 10/10/2026 - 21:09

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ తగిలింది. జాతీయ జట్టును వీడిన వ్యవహారంలో పోర్చుగల్‌ ఫుట్‌బాల్ సమాఖ్య అతడిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. ఈ కేసును అత్యవసరంగా పరిగణించిన సమాఖ్య.. తుది నిర్ణయం వెలువడే వరకు రొనాల్డోపై తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు ప్రకటించింది.

నార్వేతో సెప్టెంబర్ 27న జరిగిన మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేశారు. సబ్‌స్టిట్యూట్‌గా ఆడేందుకు సిద్ధమవ్వాలని సూచించినప్పటికీ, అతడికి మైదానంలోకి దిగే అవకాశం రాలేదు. ఆ తర్వాత అక్టోబర్ 1న డెన్మార్క్‌తో మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కదని తెలియడంతో అతడు జాతీయ జట్టును వీడాడు. ఈ వ్యవహారమే తాజా వివాదానికి కారణమైంది.

శిక్షకు సిద్ధమన్న రొనాల్డో
జాతీయ జట్టుకు దూరమయ్యే ఆలోచన లేదని రొనాల్డో స్పష్టం చేశాడు. సమాఖ్య విధించే శిక్షను స్వీకరించేందుకు సిద్ధమని కూడా తెలిపాడు.

తన చర్యలకు శిక్ష పడాల్సిందేనని అంగీకరించిన రొనాల్డో.. శిక్ష పూర్తయిన తర్వాత జాతీయ జట్టు తరఫున ఆడేందుకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. దేశం తరఫున పోటీపడి విజయాలు సాధించేందుకు ఎప్పటిలాగే సిద్ధంగా ఉంటానని పేర్కొన్నాడు.

క్లబ్ తరఫున బరిలోకి దిగి గోల్
ఓ పక్క ఈ వివాదం నడుస్తుండగానే రొనాల్డో అల్ నస్ర్ క్లబ్‌ తరఫున గోల్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో అల్ నస్ర్ 3-0తో దిరియాపై విజయం సాధించింది.

నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్‌కు శుభారంభం
మరోపక్క నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఇదీ చదవండి: భారత జట్టుకు ఎంపిక కాకపోతే అది నా నష్టం కాదు..!


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)