Breaking News

పూరన్‌ సిక్సర్ల సునామీ.. 53 బంతుల పాటు విధ్వంసం

Published on Wed, 09/17/2025 - 15:36

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025 తుది దశకు చేరింది. భారతకాలమానం ప్రకారం ఇవాల్టి నుంచి (సెప్టెంబర్‌ 17) ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఇవాళ జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఘన విజయం సాధించి, క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడిన ఫాల్కన్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

రేపు జరుగబోయే క్వాలిఫయర్‌-1లో సెయింట్‌ లూసియా కింగ్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్‌ 22న జరిగే ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు సెప్టెంబర్‌ 20న జరిగే క్వాలిఫయర్‌-2లో నైట్‌రైడర్స్‌తో పోటీపడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-1 విజేతతో ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఫాల్కన్స్‌పై నైట్‌రైడర్స్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌.. ఆమిర్‌ జాంగూ (55), ఆండ్రియస్‌ గౌస్‌ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 

ఆఖర్లో షకీబ్‌ అల్‌ హసన్‌ (9 బంతుల్లో 26 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ 3 వికెట్లు, ఉస్మాన్‌ తారిఖ్‌, ఆండ్రీ రసెల్‌ తలో 2, సునీల్‌ నరైన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్‌.. అలెక్స్‌ హేల్స్‌ (54 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (53 బంతుల్లో 90 నాటౌట్‌; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆడుతుపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆ జట్టు 17.3 ఓవర్లలో కొలిన్‌ మున్రో (14) వికెట్‌ మాత్రమే కోల్పోయి అద్భుత విజయం సాధించింది. పూరన్‌ సిక్సర్ల సునామీ సృష్టించి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)