Breaking News

113 మీటర్ల‌ భారీ సిక్స‌ర్‌! (వీడియో)

Published on Mon, 08/12/2024 - 12:51

ది హాండ్రడ్ లీగ్‌-2024లో వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో నార్త్‌రన్ సూపర్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నికోలస్ పూరన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.

ఆదివారం మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 153 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో మాంచెస్టర్ బౌల‌ర్ల‌ను ఈ క‌రేబియ‌న్ బ్యాట‌ర్ ఊచ‌కోత కోశాడు. 33 బంతులలో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

అయితే ఈ మ్యాచ్‌లో పూర‌న్ ఓ భారీ సిక్స‌ర్ బాదాడు. నార్త్‌రన్ ఇన్నింగ్స్ 74వ బంతిని  స్కాట్ క్యూరీ.. పూర‌న్‌కు స‌రిగ్గా స్లాట్‌లో సంధించాడు. ఈ క్ర‌మంలో పూర‌న్ కాస్త క్రీజు నుంచి డీప్‌గా వెళ్లి మిడ్ వికెట్‌పై నుంచి 113 మీట‌ర్ల‌ భారీ సిక్స‌ర్ కొట్టాడు.

అత‌డి ప‌వ‌ర్‌ బంతి ఏకంగా స్టేడియం బయట పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో మాంచెస్టర్‌పై నార్త్‌రన్ సూపర్ ఛార్జర్స్‌ విజయం సాధించింది.
 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)