Breaking News

రెండు ప్రపంచకప్‌లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్‌పై చోరీ కేసు

Published on Fri, 08/29/2025 - 15:19

ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఓ వార్త క్రికెట్‌ సమాజాన్నంతా షాక్‌కు గురి చేస్తుంది. రెండు టీ20 ప్రపంచకప్‌లు, 97 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న పపువా న్యూగినియా క్రికెటర్‌ కిప్లింగ్ డోరిగా (Kipling Doriga) చోరీ కేసులో బుక్కాయ్యాడు.

ఆగస్టు 25వ తేదీ ఉదయం జెర్సీ ద్వీప రాజధాని  సెయింట్‌ హెలియర్స్‌ (St Heliers) ప్రాంతంలో ఓ చోరీ జరిగింది. ఈ ఘటనలో డోరిగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు తెలుస్తుంది. డోరిగాను స్థానిక పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా నేరాన్ని ఒప్పుకున్నాడని సమాచారం.

రిలీఫ్ మేజిస్ట్రేట్ రెబెక్కా మోర్లే-కిర్క్ ఈ కేసును తీవ్రమైందిగా పరిగణించి రాయల్ కోర్టుకు బదిలీ చేశారు. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేశారు. ఈ కేసులో డోరిగాకు బెయిల్ నిరాకరించబడింది. తదుపరి వాయిదా వరకు డోరిగా పోలీసుల కస్టడీలో కొనసాగనున్నాడు.

ఈ పరిణామం పపువా న్యూగినియా క్రికెట్ బోర్డును అప్రతిష్ఠపాలు చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆ జట్టు తల దించుకునేలా చేసింది. ఓ అంతర్జాతీయ క్రికెటర్‌ చోరీ కేసులో ఇరుక్కోవడం​ ఐసీసీ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఈ ఘటన అంతర్జాతీయ క్రీడా సమాజంలో క్రికెట్‌ ప్రతిష్టను దెబ్బతీసింది. పపువా న్యూగినియా ఐసీసీ అసోసియేట్‌ సభ్య దేశంగా ఉంది.

వికెట్‌కీపర్ కమ్‌ బ్యాటర్ అయిన 29 ఏళ్ల డోరిగా 2021, 2024 టీ20 ప్రపంచకప్‌లలో పపువా న్యూగినియాకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ స్థాయిలో 97 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న డోరిగా, ప్రస్తుతం CWC ఛాలెంజ్ లీగ్ రెండో రౌండ్‌లో పపువా న్యూగినియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)