Breaking News

కాలితో సంతకం చేసిన శీతల్‌.. ప్రధాని మోదీకి జెర్సీ

Published on Fri, 09/13/2024 - 15:32

పారాలింపిక్స్‌ క్రీడాకారులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పారా విశ్వక్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన బృందాన్ని కొనియాడారు. భారత పారాలింపిక్స్‌ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్కును సెట్‌ చేశారంటూ అభినందించారు.  కాగా పారిస్‌ పారాలింపిక్స్‌-2024లో భారత్‌ అత్యధికంగా 29 పతకాలు గెలిచింది. ఇందులో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, పదమూడు కాంస్య పతకాలు ఉన్నాయి.

నేలపై కూర్చున్న మోదీ
ఈ క్రమంలో టోక్యో పారాలింపిక్స్‌ పతకాల(19) రికార్డు బ్రేక్‌ అయింది. ఈ నేపథ్యంలో పారిస్‌ నుంచి పతకాలతో తిరిగి వచ్చిన పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారాలింపియన్ల అంకితభావాన్ని కొనియాడిన ప్రధాని వారిని అభినందించారు. 

అదే విధంగా.. ప్రతి ఒక్కరితో విడివిడిగా కలుసుకొని ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా శారీరక ఎదుగుదల లోపం ఉన్న జావెలిన్‌ త్రోయర్‌ నవ్‌దీప్‌ సింగ్‌తో మోదీ అహ్లాదంగా గడిపారు. మరుగుజ్జు క్రీడాకారుడైన అతని చేతుల మీదుగా టోపీ ధరించేందుకు నేలపై కూర్చున్నారు. దీంతో నవ్‌దీప్‌ అమితానందంతో ప్రధానికి టోపీ తొడిగాడు. 

అనంతరం తన చేతి భుజంపై ఆటోగ్రాఫ్‌ కోరగా... ప్రధాని వెంటనే పెన్‌ తీసుకొని అతని ముచ్చట తీర్చారు. జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించిన అతని గురించి అడిగి తెలుసుకున్నారు. 

 

కాలితో సంతకం చేసిన శీతల్‌
అదే విధంగా.. షూటర్‌ అవని లేఖరా, జూడో ప్లేయర్‌ కపిల్‌ పర్మార్, ఆర్చర్లు శీతల్‌ దేవి, రాకేశ్‌ కుమార్‌ తదితరులు ప్రధానితో ముచ్చటించారు. ఈ సందర్భంగా శీతల్‌ కాలితో సంతకం చేసిన జెర్సీని మోదీకి బహూకరించింది. ఇక ఈ భేటీకి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ శుక్రవారం.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేశారు.

చదవండి: అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్‌ దేవి

 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు