Breaking News

తీరు మారని తెలుగు టైటాన్స్‌.. వరుసగా రెండో ఓటమి

Published on Sun, 08/31/2025 - 07:58

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. సీజన్‌ ఆరంభ పోరులో తమిళ్‌ తలైవాస్‌ చేతిలో ఓడిన టైటాన్స్‌... తాజాగా యూపీ యోధాస్‌ చేతిలో కూడా పరాజయం పాలైంది. 

శనివారం తెలుగు టైటాన్స్‌ 35–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ చేతిలో ఓడింది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పట్టికలో ఏడోస్థానానికి పరిమితమైన టైటాన్స్‌... ఈ సీజన్‌ ఆరంభంలో విశాఖ తీరంలో జరుగుతున్న మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. 

తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ విజయ్‌ మాలిక్‌ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం అందలేదు. చేతన్‌ సాహు 4, భరత్‌ 3 పాయింట్లు సాధించారు. విజయ్‌ ఈ సీజన్‌లో తొలి సూపర్‌–10 ఖాతాలో వేసుకున్నాడు. 

యూపీ యోధాస్‌ తరఫున గగన్‌ గౌడ 14 పాయింట్లతో విజృంభించగా... కెప్టెన్‌ సుమిత్‌ సాంగ్వాన్‌ (8 పాయింట్లు), గుమాన్‌ సింగ్‌ (7 పాయింట్లు) అతడికి అండగా నిలిచారు. యూ ముంబా, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ నిరీ్ణత సమయంలో 29–29 పాయింట్లతో ‘టై’కాగా... ఆ తర్వాత నిర్వహించిన సూపర్‌ రెయిడ్స్‌లో యూ ముంబా 6–5 పాయింట్ల తేడాతో గెలుపొందింది. 

నిర్ణీత సమయంలో యూ ముంబా జట్టు తరఫున రోహిత్‌ రాఘవ్‌ 7, అజిత్‌ చౌహాన్‌ 6 పాయింట్లు సాధించారు. 
గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున హిమాన్షు సింగ్‌ 7 పాయింట్లు, రాకేశ్‌ 5 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో యూ ముంబా (రాత్రి 8 గంటలకు), బెంగాల్‌ వారియర్స్‌తో హర్యానా స్టీలర్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
చదవండి: KCL 2025: టీ20ల్లో ప్ర‌పంచ రికార్డు.. రెండు ఓవ‌ర్ల‌లో 71 పరుగులు! వీడియో

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు