Breaking News

PKL 11: తమిళ్‌ తలైవాస్‌ జోరు.. పుణెరి పల్టాన్‌కు షాక్‌

Published on Wed, 10/23/2024 - 21:26

సాక్షి, హైదరాబాద్:  ప్రొ కబడ్డీ లీగ్‌ పదకొండవ సీజన్‌లో  తమిళ్ తలైవాస్ జోరు కొనసాగుతోంది. తొలుత తెలుగు టైటాన్స్‌ను ఓడించిన తలైవాస్‌.. తాజాగా మరో విజయం నమోదు చేసింది. రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌కు షాకిచ్చింది. జీఎంసీ బాలయోగి ఇండోర్‌‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 35–30  తేడాతో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. తలైవాస్ తరఫున రైడర్లు నరేందర్ కండోలా  9, సచిన్  8 పాయింట్లతో ఆకట్టుకున్నారు. డిఫెండర్ నితేశ్ కుమార్ (5) హైఫైవ్ సాధించాడు.

ఇక పుణెరి జట్టులో రైడర్ మోహిత్ గోయత్ (13) ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ను తలైవాస్ రెండుసార్లు ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ ఆరంభం నుంచి జోరు కనబరిచింది. నరేందర్ వరుసగా రెండు టచ్ పాయింట్లు రాబట్టగా, పంకజ్‌, అస్లాంను తలైవాస్ డిఫెండర్లు ట్యాకిల్ చేయడంతో ఆ జట్టు 4–0 ఆధిక్యంతో ఆటను ఆరంభించింది.

అయితే, సచిన్‌ను సూపర్‌‌ ట్యాకిల్ చేసిన పుణెరి పల్టాన్ 5–6తో ముందుకొచ్చింది. మోహిత్ వరుసగా రెండు డబుల్ పాయింట్ల రైడ్లతో ఆకట్టుకోగా..  అస్లాం కూడా డబుల్ పాయింట్ రైడ్ చేయడంతో పుణెరి 10–11తో నిలిచింది. కానీ, కోర్టులో మిగిలిన అస్లాంను ట్యాకిల్ చేసిన తలైవాస్ 8వ నిమిషంలో  పుణెరి ఆలౌట్ చేసి 14–11తో ముందంజ వేసింది. ఇక్కడి నుంచి పుణెరి డిఫెన్స్‌లో మెరుగైనా తమిళ జట్టు తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. డూ ఆర్ డై రైడ్ కి వచ్చిన మోహిత్‌ను ట్యాకిల్ చేసి 19–15తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

సెకండాఫ్‌ మొదలైన వెంటనే సచిన్‌ ఓ టచ్ పాయింట్ తీసుకురాగా, ఆకాశ్‌ను నితేశ్‌ ట్యాకిల్‌ చేశాడు.  డుబ్కితో ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేసిన అస్లాంను తలైవాస్ డిఫెండర్లంతా నిలువరించారు. దాంతో తలైవాస్ 22–15తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.ఈ దశలో పుణెరి డిఫెండర్లు సత్తా చాటారు.  

నరేందర్‌‌ను సూపర్ ట్యాకిల్‌ చేసిన పుణెరి మరోసారి అతడిని నిలువరించింది. సాహిల్‌ ప్రత్యర్థికి దొరికిపోయినా సచిన్‌ను సూపర్‌‌ ట్యాకిల్ చేసిన  పల్టాన్‌ డిఫెండర్లు  21–24తో అంతరాన్ని తగ్గించారు. కానీ, తలైవాస్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. నరేందర్‌‌ మళ్లీ రైడింగ్‌లో జోరు పెంచగా.. డిఫెండర్లు కూడా విజృంభించారు. ఈ క్రమంలో పుణెరిని రెండోసారి ఆలౌట్‌ చేసిన తలైవాస్  30–22తో తన ఆధిక్యాన్ని భారీగా పెంచుకుంది. చివరి నిమిషాల్లో పుణెరి డిఫెండర్లు సూపర్ ట్యాకిల్స్‌ తో ఆకట్టుకోవడంతో ఓటమి అంతరం తగ్గింది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)