Breaking News

PKL: దబంగ్‌ ఢిల్లీ ధమాకా... పదో విజయంతో..

Published on Tue, 10/07/2025 - 12:15

చెన్నై: మాజీ చాంపియన్‌ దబంగ్‌ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌ (PKL 12)లో పదో విజయంతో ‘టాప్‌’ లేపింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు 29–26తో మాజీ విజేత జైపూర్‌ పింక్‌పాంథర్స్‌పై గెలుపొందింది. 

కెప్టెన్, రెయిడర్‌ అశు మలిక్‌ 8 పాయింట్లతో అదరగొట్టాడు. 17 సార్లు కూతకెళ్లిన ఢిల్లీ కెపె్టన్‌ 8 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్‌ సందీప్‌ (7) కూడా రాణించడంతో దబంగ్‌ జట్టు ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. 

ఆఖరి వరకు పోరాడినా..
మరోవైపు జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ సమష్టిగా గెలిచేందుకు పోరాడింది. డిఫెండర్లు రెజా మీర్‌బగేరి (5), దీపాన్షు ఖత్రి (5), ఆర్యన్‌ కుమార్‌ (4) ప్రత్యర్థి రెయిడర్లను బెంబేలెత్తించారు. రెయిడర్లలో మీతు, అలీ సమది చెరో 2 పాయింట్లు చేశారు. 11 మ్యాచ్‌లాడిన దబంగ్‌ ఢిల్లీ 10 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

యూపీపై పట్నా గెలుపు
అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ 36–28తో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది. పైరేట్స్‌ తరఫున రెయిడర్‌ అయాన్‌ (15) చెలరేగాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు. 

మిగతా వారిలో డిఫెండర్లు నవ్‌దీప్‌ (5), దీపక్‌ (4) రాణించారు. యూపీ యోధాస్‌ జట్టులో రెయిడర్‌ గగన్‌ (10) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో శివమ్‌ (3), మహేందర్‌ సింగ్‌ (2), హితేశ్‌ (2), సుమిత్‌ (2) ఫర్వాలేదనిపించారు. ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో తమిళ్‌ తలైవాస్, హరియాణా స్టీలర్స్‌తో దబంగ్‌ ఢిల్లీ తలపడనున్నాయి.  

చదవండి: Pro Kabaddi League: తెలుగు టైటాన్స్‌ గెలుపు జోరు..  

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు