Breaking News

PKL 11: దుమ్ములేపిన టైటాన్స్‌.. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషంలో గెలుపు

Published on Sat, 11/09/2024 - 21:28

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌(PKL) పదకొండో  సీజన్‌లో భాగంగా.. సొంతగడ్డపై తమ  చివరి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. టేబుల్‌ టాపర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పాయింట్‌ తేడాతో విజయం సాధించింది. ఆట ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో  పుణెరికి‌ చెక్ పెట్టి వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది.

కాగా గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34–33 తేడాతో పుణెరిని ఓడించింది. టైటాన్స్ జట్టులో విజయ్ 13 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌‌గా నిలవగా..  కెప్టెన్ పవన్ సెహ్రావత్  12 పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు.

ఇక పుణెరి జట్టులో పంకజ్ మోహితే 9 పాయింట్లతో సత్తా చాటగా.. అతడికి తోడుగా  అజిత్ కుమార్ ఆరు,మోహిత్ గోయత్  ఐదు పాయింట్లతో రాణించారు. అయినప్పటికీ ఆఖరికి ఓటమి నుంచి పుణెరి తప్పించుకోలేకపోయింది.

ఆధిపత్యం చేతులు మారగా
కాగా ఆట ఆరంభంలోనే తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. కెప్టెన్‌ పవన్ సెహ్రావత్‌ వరుస రెయిడ్ పాయింట్లకు తోడు డిఫెండర్లు కూడా రాణించారు. ఇక తన  మూడు  రెయిడ్స్‌ లో పవన్  నాలుగు పాయింట్లు రాబట్టగా.. టైటాన్స్ 5–0 ఆధిక్యంతో ఆటలో ఆధిపత్యం కనబరిచింది. ఈ క్రమంలో పుణెరి జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలిపోవడంతో ఆ జట్టు ఆలౌట్‌ ప్రమాదం ముంగిట నిలిచింది.

ఇలాంటి దశలో పంకజ్ బోనస్ పాయింట్‌తో పుణెరి ఖాతా తెరిచాడు. పవన్‌ మరో టచ్ పాయింట్ట రాబట్టగా.. పుణెరి కోర్టులో  పంకజ్ ఒక్కడే  మిగిలాడు. తీవ్ర ఒత్తిడిలో కూతకు వెళ్లిన పంకజ్‌ బోనస్‌, సూపర్‌‌ రెయిడ్‌తో మూడు పాయింట్లతో జట్టును ఆదుకున్నాడు. ఆ వెంటనే పవన్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన పుణెరి 6–6తో స్కోరు సమం చేసింది.

తొలి అర్ధభాగం 20–20తో సమంగా 
అస్లాం, పంకజ్ చెరో పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన విజయ్‌ను ట్యాకిల్ చేసిన పుణెరి డిఫెండర్లు తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేశారు. దాంతో పుణెరి 13–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. జట్టు మొత్తం కోర్టుపైకి వచ్చిన తర్వాత టైటాన్స్‌ తిరిగి పుంజుకుంది. పవన్ తన జోరు కొనసాగిస్తూ సూపర్‌‌ టెన్ పూర్తి చేసుకున్నాడు.

మరో రెయిడర్ విజయ్‌ మాలిక్ కూడా ఆకట్టుకోగా..  డిఫెన్స్ విభాగం కూడా మెరుగవ్వడంతో పుణెరిని ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న తెలుగు జట్టు 20–18తో తిరిగి ఆధిక్యం సాధించింది. కానీ, విరామం ముంగిట పవన్ ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోవడంతో తొలి అర్ధభాగం 20–20తో సమంగా ముగిసింది.

ఆఖరికి టైటాన్స్ పైచేయి
రెండో అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. ఇరు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లడంతో ఆట సమంగా సాగింది. విరామం తర్వాత పది నిమిషాల్లో  చెరో నాలుగు పాయింట్లు మాత్రమే రాబట్టాయి. అటు టైటాన్స్, ఇటు పల్టాన్‌ ఏ మాత్రం తప్పిదానికి తావివ్వకుండా ఆడే ప్రయత్నం చేశాయి.

ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో ఎక్కువగా ఎమ్టీ రెయిడ్స్‌ వచ్చాయి. టైటాన్స్ ఒక్కో పాయింట్ ఆధిక్యంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసినా పుణెరి వెంటనే స్కోరు సమం చేయడంతో ఆట ఉత్కంఠగా సాగింది. అయితే రెండో భాగంలో పవన్ సెహ్రావత్ వేగం తగ్గింది.  

విజయ్‌ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నా..  టైటాన్స్ కోర్టులో తక్కువ మంది ఉండటంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది.  ఓ దశలో 31–29తో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్‌ మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆలౌట్‌ అయింది. దాంతో పుణెరి 33–32తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి నిమిషంలో విజయ్‌ ఒక రెయిడ్ పాయింట్‌తో పాటు అజిత్‌ కుమార్‌‌ను ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు