రిటైర్మెంట్‌ ప్రకటించిన ఐపీఎల్‌ దిగ్గజం

Published on Fri, 06/06/2025 - 14:46

ఐపీఎల్‌ దిగ్గజ బౌలర్‌ పియూశ్‌ చావ్లా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ఇవాళ (జూన్‌ 6) వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలీ క్రికెట్‌కు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నాడు. 36 ఏళ్ల పియూశ్‌ చావ్లాకు ఐపీఎల్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 

ఆరంభ సీజన్‌ నుంచి (2008) క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆడుతున్న అతను 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో చహల్‌ (221), భువనేశ్వర్‌ కుమార్‌ (198) మాత్రమే చావ్లా కంటే ఎక్కువ వికెట్లు తీశారు. సునీల్‌ నరైన్‌ చావ్లాతో సమానంగా 192 వికెట్లు తీశాడు.

2008లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో కెరీర్‌ ప్రారంభించిన చావ్లా.. ఆతర్వాత కేకేఆర్‌, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిగా 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన చావ్లాను ఈ సీజన్‌ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన చావ్లా 2006లో టీమిండియా తరఫున టెస్ట్‌ అరంగేట్రం చేసి, ఆ ఫార్మాట్‌లో 3 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో టీ20 అరంగేట్రం చేసిన చావ్లా 25 వన్డేల్లో 32 వికెట్లు, 7 టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. 

చావ్లా అంతర్జాతీయ కెరీర్‌ అంత సుదీర్ఘంగా సాగనప్పటికీ.. భారత్‌ గెలిచిన రెండు వరల్డ్‌కప్‌ టోర్నీల్లో భాగంగా ఉన్నాడు. చావ్లా 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జన్మించిన చావ్లా.. సొంత రాష్ట్రం​ తరఫున 2008-2013 వరకు దేశవాలీ క్రికెట్‌ ఆడాడు. ప్రస్తుతం అతను గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చావ్లాకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోనూ ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 

ఇందులో 137 మ్యాచ్‌లు ఆడిన చావ్లా మూడు 10 వికెట్ల ప్రదర్శనలు, 23 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 446 వికెట్లు తీశాడు. దేశవాలీ క్రికెట్‌లో చావ్లా బ్యాటర్‌గానూ రాణించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతని పేరు మీద 6 సెంచరీలు, 36 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)