Breaking News

పియాస్ట్రికి పోల్‌ పొజిషన్‌

Published on Sun, 03/23/2025 - 04:13

షాంఘై: ఫార్ములావన్‌ సీజన్‌ రెండో రేసు చైనీస్‌ గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి (ఆస్ట్రేలియా) పోల్‌ పోజిషన్‌ సాధించాడు. ఫార్ములావన్‌ కెరీర్‌లో అతడికి ఇదే తొలి పోల్‌ పొజిషన్‌ కావడం విశేషం. 23 ఏళ్ల ఆసీస్‌ రేసర్‌ శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా... 1 నిమిషం 30.641 సెకన్లలో ల్యాప్‌ పూర్తిచేశాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును పియాస్ట్రి తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. 

మెర్సెడెస్‌ డ్రైవర్‌ రసెల్‌ (1 నిమిషం 30.723 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. గత వారం ఆ్రస్టేలియా గ్రాండ్‌ ప్రిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రపంచ మాజీ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (బ్రిటన్‌) చైనీస్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. 56 ల్యాప్‌లతో కూడిన రేసులో మెక్‌లారెన్‌ జట్టుకే చెందిన మరో డ్రైవర్‌ లాండో నోరిస్‌ (1 నిమిషం 30. 793 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. 

గత వారం సీజన్‌ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన నోరిస్‌ ఈ రోజు జరగనున్న రేసును మూడో స్థానంతో ప్రారంభించనున్నాడు. మాజీ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (1 నిమిషం 30.817 సెకన్లు) నాలుగో ‘ప్లేస్‌’లో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసులో 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)