Breaking News

పాకిస్తాన్‌ క్రికెట్‌లో కీలక పరిణామం.. ఈసారి..

Published on Thu, 03/05/2026 - 21:32

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సెలక్టర్‌ పదవికి అలీం దర్‌ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో ఇద్దరిని సెలక్షన్‌ కమిటీలో చేర్చింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పాకిస్తాన్‌ జట్టు విఫలమైన విషయం తెలిసిందే.

సెమీ ఫైనల్‌ చేరకుండానే
గ్రూప్‌ దశలో ఫర్వాలేదనిపించిన సల్మాన్‌ ఆఘా బృందం.. సూపర్‌-8లో మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా సెమీ ఫైనల్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టుపై.. ముఖ్యంగా సీనియర్లు బాబర్‌ ఆజం (Babar Azam), షాబాద్‌ ఖాన్‌, షాహిన్‌ ఆఫ్రిదిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

అలీం దర్‌ రాజీనామా
ఈ క్రమంలో సెలక్టర్‌, మాజీ అంపైర్‌ అలీం దర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. శ్రీలంకలో తమ మ్యాచ్‌ల దృష్ట్యా హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ (Mike Hesson), మరో సెలక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ బాబర్‌, షాదాబ్‌లను ఆడించాలని పట్టుపట్టగా.. అలీం మాత్రం వ్యతిరేకించినట్లు సమాచారం.

అంతేకాదు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను ఎంపిక చేయాలని అలీం వాదించగా.. మిగతా వారు అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో నొచ్చుకున్న అలీం దర్‌ తన పదవికి రాజీనామా చేశాడు.

సెలక్టర్లు మాజీ కెప్టెన్లు 
ఈ నేపథ్యంలో పీసీబీ ఇద్దరిని జాతీయ సెలక్షన్‌ కమిటీలో చేర్చింది. మాజీ కెప్టెన్లు మిస్బా ఉల్‌ హక్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌లకు మెన్స్‌ సెలక్షన్‌ కమిటీలో చోటు ఇచ్చింది. కాగా ఆకిబ్‌ జావేద్‌, అసద్‌ షఫీక్‌లతో కలిసి వీరిద్దరు సెలక్టర్లుగా పనిచేయనున్నారు. 

కాగా అలీం దర్‌ గతేడాది అక్టోబరులో పాక్‌ పురుషుల జట్టు కెప్టెన్‌గా వచ్చాడు. అయితే, హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ అతి జోక్యం, ఆకిబ్‌ జావేద్‌ అతడికే వంతపాడిన నేపథ్యంలో విసుగు చెంది రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా జియో సూపర్‌ వెల్లడించింది.

గతంలో ఇలా..
ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్‌ అహ్మద్‌ గతంలో పాకిస్తాన్‌ అండర్‌-19 జట్టు పాక్‌ షాహీన్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. మరోవైపు.. మిస్బా ఉల్‌ హక్‌ గతంలో పాక్‌ జట్టు హెడ్‌కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలే నిర్వర్తించాడు. 

అంతేకాదు.. పీసీబీ క్రికెట్‌ టెక్నికల్‌ కమిటీలో సభ్యుడిగానూ సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి సెలక్టర్‌గా తిరిగి వచ్చాడు. ఇక బాబర్‌, షాదాబ్‌ విఫలమైన సంగతి తెలిసిందే. 
చదవండి: T20 WC 2026: రషీద్‌ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)