Breaking News

'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్‌ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా'

Published on Thu, 06/22/2023 - 10:58

''ఆసియా కప్‌ను హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని.. దీనిని వ్యతిరేకిస్తున్నానంటూ''.. పీసీబీకి కాబోయే చైర్మన్‌ జకా అష్రఫ్‌ బాంబు పేల్చాడు. ఇటీవలే పీసీబీ తాత్కాలిక చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న నజమ్‌ సేథీ ఆసియా కప్‌ను హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ)కు ప్రతిపాదన పంపారు. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన ఏసీసీ పాక్‌ ప్రతిపాదనను ఒప్పుకొని ఆసియా కప్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది.

దీంతో ఆసియా కప్‌ షెడ్యూల్‌ కూడా విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు.. శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.తాజాగా బుధవారం  పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ మాట్లాడుతూ ఆసియా కప్‌ను హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''నేను ఈ హైబ్రిడ్ మోడల్‌ను గతంలోనే వ్యతిరేకించా. ఇదో అర్థం పర్థం లేని  విధానం. నేను దీనికి అంగీకరించను. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ).. ఈ ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తానని తెలిపింది. దాని ప్రకారం ఈ టోర్నీ ఇక్కడే జరగాలి.  

ఇక టోర్నీలో ప్రధాన మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్  బయటే జరగనున్నాయి. భూటాన్, నేపాల్ వంటి చిన్న జట్లు మాత్రమే  ఇక్కడికి వస్తున్నాయి.  ఇది పాకిస్తాన్ కు ఒకరకంగా అవమానమే. గతంలో మా బోర్డు ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే అవగాహన లేదు. ఆ సమాచారం గురించి నాకు తెలియదు. కానీ క్లారిటీ మాత్రం ఉంది. ఈ తక్కువ వ్యవధిలో ఏం చేయగలనో అది చేస్తా'' అని చెప్పుకొచ్చాడు.

అష్రఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ఏడాది ఆసియా కప్ భవితవ్యం మళ్లీ  ప్రమాదంలో పడ్డట్టే. హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆడితే పూర్తి మ్యాచ్ లు శ్రీలంకలోనే ఆడాలి లేదంటే  టోర్నీ నుంచి నిష్క్రమించాలి. ఇంతకుమించి  పాక్‌కు మరో ఆప్షన్‌ లేదు. ఎందుకంటే  బీసీసీఐ ఇదివరకే  తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదని  కుండబద్దలు కొట్టింది. ఒకవేళ భారత్ లేకున్నా ఆసియా కప్ నిర్వహించడం  అసాధ్యం. ఇక జకా అష్రఫ్‌ పీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో టీమిండియా, పాకిస్తాన్‌లు చివరి'సారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడాయి. 

చదవండి: 'గిల్‌ క్యాచ్‌' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది!

#AsiaCup2023: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది'

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు