Breaking News

ఫ్రీ ఫ్రీ.. రండి బాబు రండి! బ్రతిమాలుకుంటున్న పీసీబీ

Published on Tue, 10/07/2025 - 20:08

ఆసియాక‌ప్‌-2025 టైటిల్‌ను కోల్పోయిన పాకిస్తాన్ జ‌ట్టు ఇప్పుడు మ‌రో క‌ఠిన స‌వాల్‌కు సిద్ద‌మవుతోంది. స్వ‌దేశంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికాతో పాక్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ల‌హోర్ వేదిక‌గా అక్టోబ‌ర్ 12 నుంచి అక్టోబ‌ర్ 16 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

ఈ నేప‌థ్యంలో అభిమానుల‌ను ఆక‌ర్షించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ రెండు మ్యాచ్‌లు జ‌రిగే స్టేడియాల్లో కొన్ని స్టాండ్స్ వ‌ర‌కు ప్రేక్ష‌కులకు ఉచిత ప్ర‌వేశాన్ని పీసీబీ క‌ల్పించింది. జనరల్, ఫస్ట్-క్లాస్, ప్రీమియం, వీఐపీ ఎన్‌క్లోజర్ స్టాండ్స్‌కు ఎటువంటి ధ‌ర‌ల‌ను పాక్ క్రికెట్ కేటాయించ‌లేదు. 

తొలి టెస్టు జ‌రిగే ల‌హోర్‌లో వీఐపీ ఇక్బాల్ అండ్ జిన్నా ఎండ్, గ్యాల‌రీ టిక్కెట్ ధ‌ర‌ల‌ను పీకేఆర్‌ 800-1,000( భార‌త క‌రెన్సీలో రూ.350-రూ.440)గా నిర్ణ‌యించారు. రావాల్పిండి స్టేడియంలో పీసీబీ గ్యాలరీ మొద‌టి నాలుగు రోజుల టిక్కెట్ ధ‌ర పీకేఆర్ 800(రూ.350), ఐదో రోజు పీకేఆర్ 1,000 (రూ.440)గా కేటాయించారు. 

పాకిస్తాన్‌లో టెస్టు క్రికెట్‌కు అద‌ర‌ణ రోజు రోజుకు త‌గ్గిపోతుంది. పాక్ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న కూడా అంతంత మాత్రంగా ఉండ‌డంతో ప్రేక్ష‌కులు స్టేడియంకు రావ‌డం లేదు. ఇంత‌కుముందు జ‌రిగిన టెస్టు సిరీస్‌ల‌లో స్టాండ్స్ ఖాళీగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఈ క్ర‌మంలోనే ప్రీ ఎంట్రీ ఇవ్వాల‌ని పీసీబీ నిర్ణ‌యించింది. ఇప్ప‌టికైనా స్టేడియాల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారో లేదో వేచి చూడాలి.
చదవండి: సహనం కోల్పోయిన వైభవ్‌ సూర్యవంశీ.. కారణం ఇదే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)