ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్

Published on Sun, 05/25/2025 - 18:02

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గాయ‌ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ సునీల్ జోషి ధ్రువీక‌రించాడు. అయితే చాహ‌ల్ ఏ గాయంతో బాధ‌ప‌డుతున్నాడ‌న్న విష‌యాన్ని జోషి స్ప‌ష్టం చేయ‌లేదు.

గాయం కార‌ణంగానే శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌కు చాహ‌ల్ దూర‌మ‌య్యాడు. చాహ‌ల్ స్దానంలో ప్ర‌వీణ్ దూబే జ‌ట్టులోకి వ‌చ్చాడు. కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే ప‌డ‌గొట్టిన దూబే.. భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

"చాహ‌ల్ చిన్న గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అందుకే అత‌డికి మేము విశ్రాంతి. అత‌డు మా త‌దుప‌రి మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉంటాడ‌ని ఆశిస్తున్నాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో సునీల్ జోషీ పేర్కొన్నాడు.

ఒక‌వేళ చాహ‌ల్ గాయం కార‌ణంగా మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మైతే పంజాబ్‌కు అది గ‌ట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే  ఈ సీజన్‌లో చాహల్ పంజాబ్‌ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అత‌డి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడిన చాహ‌ల్‌.. 9.56 ఏకానమితో 14 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

కాగా పంజాబ్ కింగ్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-2 స్ధానం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధించిన పంజాబ్‌కు ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. మే 26న జైపూర్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో పంజాబ్ త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: IPL 2025: బ్రెవిస్‌, కాన్వే, మాత్రే మెరుపులు.. సీఎస్‌కే భారీ స్కోర్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)