Breaking News

ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌.. అల్లు అర్జున్‌ను కలిసిన పంజాబ్‌ స్టార్‌ క్రికెటర్లు!

Published on Sat, 04/08/2023 - 08:49

ఐపీఎల్‌-2023లో పంజాబ్‌ కింగ్స్‌ వరుస విజయాలతో దూసుకోపోతుంది. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ వేదికగా ఏప్రిల్‌ 9న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ధావన్‌ సేన శనివారం నుంచి తమ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. పంజాబ్‌ క్రికెటర్లు రాహుల్‌ చాహర్‌, హర్‌ప్రీత్ బ్రార్ టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను కలిశారు.

ఈ సందర్భంగా బన్నీతో కలిసి వీరిద్దిరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రాహుల్‌ చాహర్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే.  ఇక అతిథ్య ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు శనివారం హైదరాబాద్‌ చేరుకోనుంది.

వరుస ఓటములతో సతమతమవుతున్న ఆరెంజ్‌ ఆర్మీ.. పంజాబ్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. కాగా లక్నో వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
చదవండిIPL 2023: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం! పిచ్‌ కూడా! ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)