పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్ దూరం

Published on Mon, 04/14/2025 - 21:25

ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్‌, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌల‌ర్ లాకీ ఫెర్గూస‌న్ మోకాలి గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఫెర్గూస‌న్ మోకాలికి గాయ‌మైంది.

అత‌డు గాయం నుంచి కోలుకోవ‌డానికి దాదాపు నాలుగు వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే సీజ‌న్ మొత్తానికి ఫెర్గూస‌న్ దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ కూడా ధృవీకరించాడు. లాకీ ఫెర్గూస‌న్ మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్నాడు.

అత‌డు ప్ర‌స్తుతం జ‌ట్టుతో ఉన్న‌ప్ప‌ట‌కి, మిగిలిన టోర్నమెంట్‌లో ఆడే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి అని హోప్స్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో ఫెర్గూస‌న్ మంచి ట‌చ్‌లో క‌న్పించాడు. ఫెర్గూసన్ పంజాబ్‌ తరపున నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.

అయితే అత‌డి స్ధానంలో జేవియర్ బార్ట్‌లెట్ లేదా అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఈ ఏడాది సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ ప‌ర్వాలేద‌న్పిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మ్యాచ్‌లు పంజాబ్ మూడింట గెలుపొందింది.

ఐపీఎల్‌-2025కు పంజాబ్ కింగ్స్ జ‌ట్టు..
శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, నెహాల్ వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ ఠాకూర్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్,  హర్నూర్ పన్ను, కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే.
చ‌ద‌వండి: IPL 2025: అక్ష‌ర్ ప‌టేల్‌కు భారీ షాక్‌.. రూ.12 లక్షల జరిమానా

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)