వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న శ్రీలంక బ్యాటింగ్‌ సంచలనం

Published on Thu, 06/26/2025 - 16:01

శ్రీలంక బ్యాటింగ్‌ సంచలనం, ఆ జట్టు ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ అద్భుత శతకంతో మెరిశాడు. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నిస్సంక 167 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 

ప్రస్తుతం అతను 102 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా దినేశ్‌ చండీమల్‌ (59) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌  నష్టానికి 204 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో లహీరు ఉడారా 40 పరుగులు చేసి తైజుల్‌ ఇస్లాం బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి  8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ ఇవాళ మరో 27 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ షద్మాన్‌ ఇస్లాం (46) టాప్‌ స్కోరర్‌ కాగా.. మొమినుల్‌ హక్‌ (21), ముష్ఫికర్‌ రహీం (35), లిటన్‌ దాస్‌ (34), మెహిది హసన్‌ మిరాజ్‌ (31), నయీమ్‌ హసన్‌ (25), తైజుల్‌ ఇస్లాం (33)  రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్‌ హక్‌ 0, కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో 8, ఎబాదత్‌ హొసేన్‌ 8 పరుగులకు ఔటయ్యారు.

బంగ్లా ఇన్నింగ్స్‌ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్‌ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.

కాగా, రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో రెండు ఇన్నింగ్స్‌ల్లో (148, 125 నాటౌట్‌) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్‌ రహీం (163),పథుమ్‌ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)