Breaking News

ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

Published on Mon, 01/19/2026 - 19:40

త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. కమిన్స్‌ మూడు లేదా నాలుగో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ప్రకటించాడు. కమిన్స్‌ వేగంగా పురోగతి సాధిస్తే ‍ప్రణాళికలు మారవచ్చని  చెప్పుకొచ్చాడు. 
 
కమిన్స్‌ గత కొంతకాలంగా లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజరీతో బాధపడుతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌ ఆడినా, గాయం తిరగబెట్టడంతో ఆతర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేకపోవడంతో, వరల్డ్‌కప్ తొలి రెండు మ్యాచ్‌లు సహా, దానికి ముందు పాకిస్తాన్‌లో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా అందుబాటులో ఉండడంలేదు. పాక్‌తో సిరీస్‌కు కమిన్స్‌ సహా నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ హేజిల్‌వుడ్ కూడా అందుబాటులో ఉండడం​ లేదు. ప్రపంచకప్‌ జట్టులో ఉన్న వీరికి విశ్రాంతినిచ్చారు.  

ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకైనా కమిన్స్‌ అందుబాటులో లేకపోవడం​ ఆస్ట్రేలియాకు పెద్ద లోటే అవుతుంది. అతని అనుభవం, డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం జట్టుకు చాలా కీలకం. అసలే ఆసీస్‌ ప్రపంచకప్‌ జట్టు అంతంతమాత్రంగా ఉంది. కమిన్స్‌ లాంటి ఆటగాడు ఒక్క మ్యాచ్‌కు దూరమైనా, ఆ జట్టు టైటిల్‌ గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచకప్‌లో ఆసీస్‌ ప్రయాణం ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో మొదలవుతుంది. ఆసీస్‌ రెండో మ్యాచ్‌ జింబాబ్వేతో ఆడనుంది. ఈ మెగా టోర్నీలో ఆసీస్‌..ఒమన్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీలంక జట్లతో గ్రూప్‌-బిలో ఉంది. 

ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్‌), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)