Breaking News

ప్యాట్ క‌మిన్స్‌ వ‌ర‌ల్డ్ రికార్డు.. ప్ర‌పంచంలోనే తొలి కెప్టెన్‌గా

Published on Mon, 12/30/2024 - 13:58

మెల్‌బోర్న్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అద్బుత‌మైన విజ‌యం సాధించింది. ఆఖ‌రి రోజు వ‌ర‌కు జ‌రిగిన ఈ బాక్సింగ్ డే పోరులో 184 ప‌రుగుల తేడాతో భార‌త్‌ను చిత్తు చేసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైన‌ల్ బెర్త్‌కు అడుగు దూరంలో ఆసీస్ నిలిచింది.

ఈ విజ‌యంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్‌ కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో క‌మ్మిన్స్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 90 ప‌రుగుల‌తో పాటు 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ రోహిత్ శర్మను ఔట్ చేసిన పాట్ క‌మిన్స్‌ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

చ‌రిత్ర సృష్టించిన కమ్మిన్స్‌..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి కెప్టెన్‌ను ఎక్కవ సార్లు ఔట్ చేసిన సారథిగా క‌మిన్స్‌ వరల్డ్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో రోహిత్‌ శర్మను ఇప్పటివరకు కమ్మిన్స్ ఆరు సార్లు ఔట్ చేశాడు. 

ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిచీ బెనాడ్ పేరిట ఉండేది. రిచీ బెనాడ్ ఇంగ్లండ్ లెజెండరీ కెప్టెన్ టెడ్ డెక్స్టర్‌ను 5 సార్లు ఔట్ చేశాడు. తాజా మ్యాచ్‌తో రిచీ బెనాడ్ ఆల్‌టైమ్ రికార్డును క‌మిన్స్‌ బ్రేక్ చేశాడు.
చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్‌ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్‌ శర్మ
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)