Breaking News

వారిద్దరూ అద్భుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్‌మన్‌ గిల్‌

Published on Tue, 07/29/2025 - 07:32

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి అంచుల నుంచి తప్పించుకొని మ్యాచ్‌ను భారత్‌ ‘డ్రా’గా ముగించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా... తర్వాతి ఐదు సెషన్లలో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రత్య‌ర్ధిని నిలువరించగలిగింది. ఇది మన జట్టు పట్టుదలను చూపించింది.

మాది ఒక గొప్ప జట్టు..
ఈ విషయాన్ని భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఉన్న తేడాను తాము చూపించగలిగామని అతను చెప్పాడు. ‘మైదానంలో 143 ఓవర్ల పాటు ఒకే లక్ష్యంతో ఒకే తరహా ఆలోచనతో మానసికంగా దృఢంగా ఉండటం చాలా కష్టం. కానీ మేం దానిని చేసి చూపించాం. ఒక మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఇదే ప్రధాన తేడా. ఈ టెస్టులో ఆటతో మాది గొప్ప జట్టని నిరూపించాం’ అని గిల్‌ వ్యాఖ్యానించాడు.

సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్‌ కేఎల్‌ రాహుల్‌తో కలిసి గిల్ నెల‌కొల్పిన‌ భాగస్వామ్యమే జట్టు రాతను మార్చింది. 70.3 ఓవర్ల వీరి భాగస్వామ్యంలో 188 పరుగులు వచ్చాయి. ఈ పార్ట్‌నర్‌షిప్‌తోనే తాము మ్యాచ్‌ను కాపాడుకోగలమనే నమ్మకం కలిగిందని గిల్‌ చెప్పాడు. 

‘మా జట్టు పట్టుదలగా ముందుకు వెళ్లాలంటే కావాల్సిన అగ్గిని రగిల్చేందుకు ఒక నిప్పు కణిక అవసరమైంది. నేను, రాహుల్‌ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం అలాంటిదే. మేం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని అప్పుడే అనిపించింది. తుది ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. శనివారం మేం ఉన్న స్థితితో పోలిస్తే మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ఎంతో సంతృప్తికరం. నా ఇన్నింగ్స్‌ పట్ల కూడా ఎంతో ఆనందంగా ఉన్నా’ అని గిల్‌ పేర్కొన్నాడు.

భారత్‌ ఓటమి నుంచి తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా, సుందర్‌లపై కూడా కెప్టెన్‌ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు 55.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 203 పరుగులు జత చేశారు. ‘జడేజా, సుందర్‌ క్రీజ్‌లో ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్‌కు అంత అనుకూల పరిస్థితి ఏమీ లేదు.

బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. కానీ అలాంటి స్థితి నుంచి ప్రశాంతంగా ఆడుతూ ఇద్దరూ సెంచరీలు సాధించడం చాలా గొప్ప విషయం. ఏకాగ్రత చెదరకుండా ప్రతీ బంతిపై వారు దృష్టి పెట్టి డ్రా వరకు తీసుకెళ్లడం ఎంతో ప్రత్యేకం. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని గిల్‌ అన్నాడు.
చదవండి: IND vs PAK: ‘పాక్‌తో మ్యాచ్‌ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)