Breaking News

Paris Paralympics 2024: మెరిసిన అవని.. షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం

Published on Fri, 08/30/2024 - 16:29

ప్యారిస్  వేదిక‌గా జ‌రుగుతున్న పారా ఒలింపిక్స్‌-2024లో భార‌త్ ప‌త‌కాల ఖాతా తెరిచింది. భార‌త పారా షూట‌ర్ అవని లేఖరా ప‌సిడి ప‌త‌కంతో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ 1లో బంగారుపతకం సాధించింది. ఫైన‌ల్లో 249.7 స్కోరు సాధించి అగ్ర‌స్ధానంలో నిలిచిన అవ‌ని.. గోల్డ్‌మెడ‌ల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. 

కాగా పారా ఒలింపిక్స్‌లో అవ‌నీకి ఇది రెండో బంగారు ప‌త‌కం కావడం గ‌మ‌నార్హం. టోక్యో పారాలింపిక్స్‌-2021లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో 22 ఏళ్ల అవ‌ని ప‌సిడి ప‌త‌కం సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో ఓ అరుదైన ఘ‌న‌త‌ను ఆమె త‌న పేరిట లిఖించుకుంది. పారా ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్ విభాగంలో రెండు గోల్డ్‌మెడల్స్‌ను సొంతం చేసుకున్న తొలి భార‌త మ‌హిళా షూట‌ర్‌గా అవ‌ని చ‌రిత్ర సృష్టించింది.

కాంస్యంతో మెరిసిన మోనా అగర్వాల్‌..
ఇక ఇదే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్ 1 విభాగంలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో మోనా 228.7 స్కోరుతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది.

 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు