Breaking News

Olympics: ఒలింపిక్స్‌లో వరుసగా ఆరు స్వర్ణాలు

Published on Mon, 08/12/2024 - 10:21

Diana Taurasi: ఒలింపిక్స్‌ బాస్కెట్‌బాల్‌లో అమెరికా క్రీడాకారిణి డయానా టురాసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. వరుసగా ఆరు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్‌బాల్‌ ఫైనల్లో అమెరికా 67–66తో ఫ్రాన్స్‌ను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 

ఈ  జట్టులో డయానా సభ్యురాలిగా ఉంది. 42 ఏళ్ల డయానా 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ పసిడి పతకాలు గెలిచిన అమెరికా బాస్కెట్‌బాల్‌ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది.   

వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా హవా 
పారిస్‌ ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా ఐదు స్వర్ణాలతో అదరగొట్టింది. చివరిరోజు మహిళల ప్లస్‌ 81 కేజీల విభాగంలో చైనా లిఫ్టర్‌ లీ వెన్‌వెన్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. లీ వెన్‌వెన్‌ మొత్తం 309 కేజీల (స్నాచ్‌లో 136 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 173 కేజీలు) బరువెత్తింది. 

చైనా తరఫున ఈ క్రీడల్లో హు జీహుయ్‌ (49 కేజీలు), షిఫాంగ్‌ లువో (59 కేజీలు), లీ ఫాబిన్‌ (61 కేజీలు), లీ హువాన్‌హువా (102 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు.    

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)