Breaking News

Olympics: షూటింగ్‌ జోడీలు విఫలం.. పతక రేసు నుంచి అవుట్‌

Published on Sat, 07/27/2024 - 13:36

Paris Olympics 2024 Day 1: ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో భారత షూటర్ల బృందానికి శుభారంభం లభించలేదు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ మెడల్‌ ఈవెంట్‌లో మన షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు.  అర్జున్‌ బబూటా–రమితా జిందాల్‌, సందీప్‌ సింగ్‌–ఇలవేనిల్‌ వలారివన్‌ జంట ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాయి. ఫలితంగా ఈ ఈవెంట్లో భారత్‌ పతక రేసు నుంచి నిష్క్రమించింది.

ఇక ఈ పోటీలో రమితా- అర్జున్‌ జోడీ ఓవరాల్‌గా 628.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా.. ఇలవేనిల్‌- సందీప్‌ ద్వయం 626.3 పాయింట్లతో 12వ స్థానానికి పడిపోయింది.

నిబంధనల ప్రకారం.. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో టాప్‌–4లో నిలిచిన నాలుగు జోడీలు మాత్రమే పసిడి, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడే అర్హత సాధిస్తాయి. అయితే, భారత షూటింగ్‌ జోడీలు ఈ అడ్డంకిని దాటలేకపోయాయి. చైనా, కొరియా, కజకిస్తాన్‌, జర్మనీ టాప్‌-4లో నిలిచాయి.

గోల్డ్‌ మెడల్‌ రౌండ్‌లో చైనా- కొరియా
ఈ నేపథ్యంలో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ మెడల్‌ ఈవెంట్‌.. గోల్డ్‌ మెడల్‌ రౌండ్‌లో చైనా- కొరియా అమీతుమీ తేల్చుకోనుండగా.. కాంస్య పతక పోరులో కజకిస్తాన్‌ జర్మనీతో తలపడనుంది. ఇదిలా ఉంటే.. తదుపరి పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ జరుగనుంది.

భారత్‌ నుంచి అర్జున్‌ సింగ్‌ చీమా, సరబ్‌జోత్‌ సింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పురుషుల విభాగంలో.. మనూ భాకర్, రిథమ్‌ సాంగ్వాన్‌ (సాయంత్రం గం. 4 నుంచి) మహిళ విభాగంలో పోటీపడనున్నారు.

రోయింగ్‌లో మరో అవకాశం
ఇండియన్‌ రోవర్‌ బాల్‌రాజ్‌ పన్వార్‌కు కూడా తొలిరోజు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెన్స్‌ వ్యక్తిగత స్కల్స్‌ హీట్‌ 1లో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే, ప్రతి హీట్‌ నుంచి టాప్‌-3 మాత్రమే ఆటోమేటిక్‌గా ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో తొలి ప్రయత్నంలో బాల్‌రాజ్‌కు నిరాశే మిగిలినా.. రేపెచెజ్‌ రౌండ్‌ రూపంలో సెమీ ఫైనల్‌ దారులు ఇంకా తెరిచే ఉన్నాయి. 
చదవండి: ఆర్చరీలో అదరగొట్టి.. క్వార్టర్‌ ఫైనల్‌లో

Videos

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు