జర్మనీ, నెదర్లాండ్స్‌ ఖేల్‌ ఖతం

Published on Wed, 07/01/2026 - 04:28

అత్యంత నిలకడగా రాణించే జట్టుగా పేరున్న జర్మనీ... ప్రపంచకప్‌లో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్‌... ఈసారి నిరాశపరిచాయి. కీలకదశలో ఒత్తిడికి తలొగ్గిన జర్మనీ, నెదర్లాండ్స్‌ నాకౌట్‌ దశ తొలి రౌండ్‌ మ్యాచ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాయి. భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పరాగ్వే, మొరాకో సంచలన ఫలితాలతో ప్రపంచకప్‌లో మరో అడుగు ముందుకు వేసి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మేటి జట్లకు కూడా చెమటలు పట్టించే ‘పెనాల్టీ షూటౌట్‌’లో పరాగ్వే 4–3తో జర్మనీపై... మొరాకో ‘పెనాల్టీ షూటౌట్‌’లో 3–2తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించాయి. 

బోస్టన్‌: గత మూడు ప్రపంచకప్‌ టోర్నీలకు అర్హత సాధించలేకపోయిన పరాగ్వే ఆ కసినంతా తాజా ప్రపంచకప్‌లో తీర్చుకుంటోంది. సమష్టి ఆటతీరుతో సత్తా చాటుకుంటోంది. లీగ్‌ దశలో మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్‌ దశకు చేరుకున్న పరాగ్వే... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్‌ జర్మనీ జట్టును కంగుతినిపించింది. 

నిర్ణీత 90 నిమిషాలు ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. 42వ నిమిషంలో జూలియో ఎన్‌సిసో గోల్‌తో పరాగ్వే 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 54వ నిమిషంలో కాయ్‌ హావెట్జ్‌ గోల్‌తో జర్మనీ స్కోరును 1–1తో సమం చేసింది. రెగ్యులర్‌ సమయం ముగిశాక రెండు జట్లు సమఉజ్జీగా నిలవడంతో... ఫలితం తేల్చేందుకు అదనపు 30 నిమిషాలు ఆడించారు. అదనపు సమయం ముగిశాకా రెండు జట్లు సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయయించేందుకు ‘పెనాల్టీ షూటౌట్‌’ నిర్వహించారు.

‘షూటౌట్‌’లో జర్మనీ ముగ్గురు ఆటగాళ్లు హావెట్జ్, వోల్టెమేడ్, జొనాథన్‌... పరాగ్వే ఇద్దరు ఆటగాళ్లు సనబ్రియా, బల్‌బయేనా గురి తప్పారు. ఆరో షాట్‌ను కెనాలో గోల్‌గా మలచడంతో పరాగ్వే సంబరాలు చేసుకుంది. ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ‘షూటౌట్‌’లో ఓడిపోయిన జర్మనీ బృందం నిరాశలో మునిగిపోయింది.

‘షూటౌట్‌’లో మూడో‘సారీ’
నెదర్లాండ్స్, మొరాకో మధ్య మ్యాచ్‌లో నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యాక రెండు జట్లు 1–1తో సమఉజ్జీగా నిలిచాయి. 72వ నిమిషంలో కోడీ గాప్‌కో గోల్‌తో నెదర్లాండ్స్‌ 1–0తో ముందంజ వేసింది. 90+1వ నిమిషంలో ఇసా డియోప్‌ గోల్‌తో మొరాకో స్కోరును 1–1తో సమం చేసింది. అదనపు సమయంలోనూ ఫలితం రాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘పెనాల్టీ షూటౌట్‌’ నిర్వహించారు. ‘షూటౌట్‌’లో నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు ఒత్తిడికి తలొగ్గి ఓటమిని మూటగట్టుకున్నారు. 2014, 2022 ప్రపంచకప్‌ టోర్నీల్లో ‘షూటౌట్‌’లోనే తడబడి నిష్క్ర మించిన నెదర్లాండ్స్‌ మూడోసారి ఈ మెగా ఈవెంట్‌లో ‘షూటౌట్‌’లో విఫలమైంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)