Breaking News

T20 WC: టి20 ప్రపంచకప్‌-2024కు అర్హత సాధించిన పసికూన

Published on Fri, 07/28/2023 - 16:00

వచ్చే ఏడాది వెస్టిండీస్‌–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్‌ ఏషియా పసిఫిక్‌ క్వాలిఫయర్స్‌ నుంచి పపువా న్యూ గినియా జట్టు టి20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. శుక్రవారం ఎమిని పార్క్‌ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టోనీ యురా 61, ఆసద్‌ వాలా 59, చార్ల్స్‌ అమిని 53 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పిలిప్పీన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ డేనియల్‌ స్మిత్‌ 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అర్ష్‌దీప్‌ శర్మ 22 పరుగులు చేశాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా రెండు వికెట్లు తీయగా.. జాన్‌ కరికో, హిరిహిరి ఒక వికెట్‌ పడగొట్టారు.

ఇప్పటికే ఐర్లాండ్‌ అర్హత సాధించగా.. తాజాగా పపువా న్యూ గినియా కూడా అర్హత సాధించడంతో టి20 వరల్డ్‌కప్‌ అర్హతకు సంబంధించి మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా క్వాలిఫయర్‌ నుంచి.. మిగతా నాలుగు బెర్తుల్లో రెండు ఆసియా నుంచి.. మరో రెండు ఆఫ్రికా క్వాలిఫయర్స్‌ నుంచి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి.

చదవండి: Ashes 2023: పాంటింగ్‌పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను'

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)