Breaking News

వన్డే ప్రపంచకప్‌కు పంత్‌ దూరం.. వికెట్‌ కీపర్‌గా వారిద్దరిలో ఒకరేనా..!

Published on Wed, 04/26/2023 - 13:04

గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లమెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ హెల్త్‌పై తాజాగా ఓ అప్‌డేట్‌ వచ్చింది. పంత్‌ పూర్తిగా కోలుకునేందుకు మరో 9 నెలల సమయం (2024 జనవరి) పట్టొచ్చని తెలుస్తోంది. ఆ సమయానికైనా పంత్‌ కోలుకున్నాడంటే అది చాలా వేగవంతమైన రికవరీ అని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్యలో అతను సెప్టెంబర్‌ నెలలో జరిగే ఆసియా కప్‌, అక్టోబర్‌, నవంబర్‌లలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం కర్రల సాయంతో నడుస్తున్న పంత్‌.. ఏ సహాయం లేకుండా నడవాలంటేనే మరికొన్ని వారాలు పట్టొచ్చని తెలుస్తోంది.

వరల్డ్‌కప్‌లో పంత్‌కు ఆల్టర్నేట్‌ ఎవరు..?
వన్డే ప్రపంచకప్‌కు పంత్‌ అందుబాటులో ఉండడని దాదాపుగా తేలిపోయింది. మరి అతని ఆల్టర్నేట్‌ ఎవరన్నదే టీమిండియా అభిమానులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న. సెలెక్టర్ల పరిశీలనలో చాలా మంది పేర్లు ఉన్నప్పటికీ, ఎవరిని ఫైనల్‌ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రాక్‌ రికార్డు, వరల్డ్‌కప్‌ సమయానికి ఆటగాళ్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకునే ఈ ఎంపిక జరుగుతుందని అంతా భావిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుత ఐపీఎల్‌లో (2023) వివిధ  జట్ల వికెట్‌కీపర్ల ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

వన్డే  వరల్డ్‌కప్‌కు ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ ముందు వరుసలో ఉన్నారు. ఆతర్వాత కేఎల్‌ రాహుల్‌, శ్రీకర్‌ భరత్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేఎల్‌ రాహుల్‌ను పూర్తి స్థాయి బ్యాటర్‌గానే వినియోగించుకోవాలని సెలెక్టర్లు భావిస్తే, ఈ జాబితా నుంచి అతని పేరు తొలగిపోవచ్చు. కొత్తగా రేసులోకి జితేశ్‌ శర్మ (పంజాబ్‌), ప్రభ్‌సిమ్రన్‌ (పంజాబ్‌), అభిషేక్‌ పోరెల్‌ (ఢిల్లీ), ఎన్‌ జగదీశన్‌ (కేకేఆర్‌) పేర్లు వచ్చాయి. గుజరాత్‌ ఓపెనర్‌, వెటరన్‌ ప్లేయర్‌ సాహా అవకాశాలను కూడా తీసిపాడేయటానికి వీలు లేదు.

ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా వన్డే వరల్డ్‌కప్‌కు సాహా అయితేనే బెటర్‌ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ పూర్తిగా తేలిపోయాడు కాబట్టి, అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. వీరే కాక యువ వికెట్‌కీపర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌ (ఢిల్లీ), ఉపేంద్ర యాదవ్‌ (సన్‌రైజర్స్‌), ధృవ్‌ జురెల్‌ (రాజస్థాన్‌), ఆనూజ్‌ రావత్‌ (ఆర్సీబీ), విష్షు వినోద్‌ (ముంబై) ఐపీఎల్‌లో తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. మరి ఫైనల్‌గా సెలెక్టర్లు ఎవరిని ఫైనల్‌ చేస్తారో వేచి చూడాలి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)