Breaking News

IPL 2025: రిషభ్‌ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

Published on Thu, 10/31/2024 - 08:52

ఐపీఎల్‌ రిటెన్షన్‌కు సంబంధించి సంచలన మార్పు ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ నుంచి వచ్చింది. భారత వికెట్‌ కీపర్, హిట్టర్‌ రిషభ్‌ పంత్‌ను క్యాపిటల్స్‌ వదిలేసుకుంది. ఐపీఎల్‌-2025లో క్యాపిటల్స్‌ యాజమాన్య ఒప్పందం ప్రకారం వచ్చే రెండు సీజన్ల పాటు జీఎంఆర్‌ గ్రూప్‌ టీమ్‌ నిర్వహణా బాధ్యతలు చూస్తుంది. 

జీఎంఆర్‌ ప్రతినిధులతో పలు అంశాల్లో పంత్‌ విభేదించడమే అందుకు కారణమని తెలిసింది. కోచ్‌ ఎంపికతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో కూడా పంత్‌ పట్టుబట్టినట్లు... గత నెల రోజులుగా దీనిపై తీవ్ర చర్చలు జరిగిన తర్వాత పంత్‌ డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించలేదని సమాచారం. 

ఆ నలుగురు జట్టుతోనే
దాంతో తమ స్టార్‌ ఆటగాడినే వదులుకునేందుకు క్యాపిటల్స్‌ యాజమాన్యం సిద్ధమైంది. 2016 నుంచి 2024 సీజన్‌ వరకు ఢిల్లీ జట్టుతో ఉన్న పంత్‌... 111 మ్యాచ్‌లలో 148.93 స్ట్రయిక్‌ రేట్‌తో 3,284 పరుగులు సాధించాడు. ఈ ఏడాది సారథిగా వ్యవహరించి జట్టును పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిపాడు. 

కాగా ఢిల్లీ ఈసారి నలుగురు ఆటగాళ్లు అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్, అభిషేక్‌ పొరేల్, ట్రిస్టన్‌ స్టబ్స్‌లను ఢిల్లీ అట్టి పెట్టుకుంది. ఏదేమైనా.. వేలంలో పంత్‌కు భారీ డిమాండ్‌ ఉండటం మాత్రం ఖాయం.    

చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్‌ రిజ్వాన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)