Breaking News

ప్రపంచకప్‌ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్‌

Published on Fri, 10/24/2025 - 17:57

నవంబర్‌ 28 నుంచి భారత్‌లో జరగాల్సిన పురుషుల జూనియర్ హాకీ వరల్డ్‌కప్‌ (Men's Hockey Junior World Cup 2025) నుంచి పాకిస్తాన్‌ తప్పుకొంది. భారత్‌తో సత్సంబంధాలు లేని కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు పాకిస్తాన్‌ హాకీ ఫెడరేషన్‌ (PHF) అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రకటన ద్వారా తెలియజేసింది.

ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన హాకీ టోర్నీ నుంచి తప్పుకోవడం పాకిస్తాన్‌కు ఇది రెండోసారి. ఆగస్ట్‌లో జరగాల్సిన పురుషుల ఆసియా కప్‌ నుంచి కూడా పాక్‌ ఇదే కారణంగా వైదొలిగింది. అప్పుడు పాక్‌ స్థానాన్ని బంగ్లాదేశ్‌తో భర్తీ చేసి టోర్నీని కొనసాగించారు.

తాజాగా జూనియర్‌ ప్రపంచకప్‌ నుంచి కూడా పాక్‌ తప్పుకోవడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రత్యామ్నాయ జట్టును వెతికే పనిలో పడింది. టోర్నీ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉండటంతో త్వరలో ప్రత్యామ్నాయ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్‌ 2025 నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 28 మధ్యలో భారత్‌లోని చెన్నై, మధురై నగరాల్లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో పాక్‌ భారత్‌, చిలీ, స్విట్జర్లాండ్‌లతో పాటు గ్రూప్‌-బిలో ఉంది.

ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్న అనంతరం​ PHF కార్యదర్శి రానా ముజాహిద్ మాట్లాడుతూ.. “ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో మా జట్టు ఆడడం సురక్షితం కాదని భావిస్తున్నాం. ఇటీవల UAEలో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భారత ఆటగాళ్లు మా ఆటగాళ్లతో చేతులు కలపలేదు. ట్రోఫీ అందుకోవడాన్ని కూడా తిరస్కరించారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల్లో మా జట్టును పంపడం సరికాదు” అని వ్యాఖ్యానించాడు.

కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 22న పాక్‌ ఉగ్రమూకలు పహల్గాంలో దాడులకు తెగబడి పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా భారత్‌ "ఆపరేషన్ సిందూర్" పేరిట పాక్‌కు తగిన గుణపాఠం చెప్పింది. ఆతర్వాత భారత్‌-పాక్‌ల మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి. 

చదవండి: రోహిత్‌ శర్మకు అనుకూలం.. టీమిండియాకు వ్యతిరేకం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)