Breaking News

రెండో టెస్టులో పాకిస్తాన్‌ విజయం

Published on Thu, 08/06/2026 - 03:42

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ (ట్రినిడాడ్‌): బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ గెలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 103/6తో బుధవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ చివరకు 46.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కవెమ్‌ హెడ్జ్‌ (71 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... తేజ్‌నారాయన్‌ చందర్‌పాల్‌ (17), అమిర్‌ జంగూ (13), కెప్టెన్‌ రోస్టన్‌ చేజ్‌ (17), షై హోప్‌ (15), సీల్స్‌ (0), గ్రీవ్స్‌ (3) విఫలమయ్యారు. 

పాక్‌ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్‌ ఖాన్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. అజాన్‌ అవైస్‌ (18), ఇమాముల్‌ హక్‌ (9) ఎక్కువసేపు నిలవలేకపోగా... తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్‌ (24 నాటౌట్‌), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (24 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేయగా... పాకిస్తాన్‌ జట్టు 387 పరుగులు చేసింది. 2023 తర్వాత విదేశాల్లో పాకిస్తాన్‌కిదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)