Breaking News

నేటి నుంచి పాక్, విండీస్‌ తొలి టెస్టు

Published on Fri, 01/17/2025 - 06:01

ముల్తాన్‌: పాకిస్తాన్‌ పర్యటనలో వెస్టిండీస్‌ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ముల్తాన్‌ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. స్పిన్‌ ట్రాక్‌పై కరీబియన్‌ను ఎదుర్కోనేందుకు ఆతిథ్య జట్టు కసరత్తు చేస్తోంది. ఇంగ్లండ్‌తో గత అక్టోబర్‌లో వాడిన స్పిన్‌ పిచ్‌నే ఈ మ్యాచ్‌కు సిద్ధం చేశారు. అప్పుడు సాజిద్‌ ఖాన్, నోమన్‌ అలీ తిప్పేశారు. ఈ తాజా సిరీస్‌లోనూ వాళ్లిద్దరిపై పాకిస్తాన్‌ గంపెడాశలు పెట్టుకుంది. 

సొంతగడ్డ అనుకూలతలతో వెస్టిండీస్‌తో తలపడతామని పాక్‌ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ చెప్పాడు. స్వదేశంలో 2–1తో ఇంగ్లండ్‌ను ఓడించిన పాక్‌... దక్షిణాఫ్రికా పర్యటనలో 0–2తో ఓడిపోయింది. అయితే మరోవైపు వెస్టిండీస్‌ ఈ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) రెండేళ్ల సైకిల్‌లో అసలు ఒక్క సిరీస్‌ కూడా గెలుపొందలేకపోయింది. 

భారత్‌ సహా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన విండీస్‌... గట్టి ప్రత్యర్థి ఆస్ట్రేలియాను 1–1తో డ్రాతో నిలువరించింది. కానీ బంగ్లాదేశ్‌తో కూడా 1–1తో సిరీస్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో డబ్ల్యూటీసీలో కరీబియన్‌ జట్టు అట్టడుగున నిలిచింది.

 అయితే గత ఫలితాలతో సంబంధం లేకుండా ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌ను విజయంతో ముగించేందుకే పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చినట్లు వెస్టిండీస్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ చెప్పాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ప్రధాన వేదికలైన కరాచీ, లాహోర్‌లలో నవీకరణ పనులు జరుగుతుండటంతో రెండో టెస్టు కూడా ముల్తాన్‌లోనే ఈ నెల 25 నుంచి జరుగుతుంది.  

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)